నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, November 7, 2010

మొగిలి రేకులు-ఓదార్పు యాత్ర.ఏది ముందుగా ముగింపుకొస్తుంది?

నేను కానీ మాఇంట్లో ఎవరు కానీ టీవీలో సోప్ లు అంటే సీరియల్సు  చూడం. కానీ ఆనోటా ఈనోటా విన్న దానిని బట్టి మొగిలి రేకులు అనేది ఆరంభమే కానీ అంతం లేకుండా సగుతున్న ఒక తెలుగు సీరియల్ అని తెలుసు. ఇప్పుడు జగన్ బాబు చేస్తున్న ఓదార్పు యాత్ర దానికి ఏమీ తీసిపోకుండా సాఆఆఆఆఆఅగుతున్నట్టు కనిపిస్తుంది.
   
ఇప్పుడు మొగిలి రేకుల్ని ముందుగా ముగుస్తారా, జగన్ తన యాత్రకి ముందుగా మంగళం పాదుతాడా చూడాలి.

16 comments:

సుజాత వేల్పూరి said...

ఓదార్పు యాత్రే!


మొగలి రేకుల్లో ఇప్పుడు రెండో తరం నడుస్తోంది. వాళ్ళకు పెళ్ళిళ్ళు అయితే మూడో తరం వస్తుంది. వాళ్ళ బాల్యం, కాలేజీ, ప్రేమ ఇవన్నీ మొదలైతే ఇహ అంతం ఎప్పుడు..మీ దురాశ కాకపోతే?

చిలమకూరు విజయమోహన్ said...

రెంటికీ అంతం లేదు మొగలిరేకులులో ఇప్పుడు రెండవతరం.సుజాతగారన్నట్లు మూడు,నాలుగు ఇంకా ఎన్నో తరాలు.అలాగే ఓదార్పుకు అర్హులవుతున్న వారి సంఖ్యకూడా నిరంతరం పెరుగుతూనే ఉందికదా!

Praveen Mandangi said...

మా జిల్లాలో 14 మంది రాజశేఖరరెడ్డి కోసం గుండె ఆగి చనిపోయినట్టు కథలు వచ్చాయి. వాళ్లు కూలీ పనులు చేసుకుని బతికేవాళ్లు. మన దేశంలో పేదవాళ్లు హాస్పిటల్ లో వైద్యం అందక చనిపోతుంటారని చాలా మందికి తెలుసు. వాళ్లు చనిపోతే జగన్ లాంటి వాళ్లు శవ రాజకీయాలు నడపడానికి పావులవుతారు.

ANALYSIS//అనాలిసిస్ said...

చూస్తూ ఉండండి మొగలిరేకులే ముందు ముగుస్తుంది ... ఓదార్పు యాత్ర జీవితకాలపు సీరియల్ అది ముగియాలంటే 2012(అంతం ) రావాలి . అప్పుడే అది ముగుస్తుంది.

Praveen Mandangi said...

మొదట్లో ఇది కూడా కొత్త రకం అబద్దం అనుకున్నాను. సాక్షి పేపర్ ఈ అబద్దాన్ని నిరంతరంగా రెపీట్ చెయ్యడంతో ఇది కూడా పాత స్టైల్ అయిపోయింది. ఒకే అబద్దం వందలాది సార్లు చెపితే వినేవాళ్లకి బోర్ కొడుతుంది. హిట్లర్ స్టైల్ లో ఒక అబద్దాన్ని వంద సార్లు చెపితే నిజమవుతుందని అనుకోలేము.

Apparao said...

:)

Saahitya Abhimaani said...

Till "he" gets a post.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

సుజాత గారూ, విజయ మోహన్ గారూ, నేనెప్పుడూ ఒక ఎపిసోడ్ కూడా మొగలి రేకులు చూడ లేదు.ఆంచేత అంత అవగాహన లేదు. కానీ నా ఉద్ధేశ్యంలో ఏది ముందు ముగుస్తుందన్న విషయం అంత తేలిక కాదు. ఇది చాలా క్లోజ్ కాంటెస్ట్. శర్మ గారూ మీరన్నది నిజమే పోయిన సంవత్సరం సెప్టెంబరు నెలలో చనిపోయిన వాళ్ళందరూ ఈ లిస్టులో చేర్చబడ్డారు.
రెండవ ప్రపంచ కాలంలో గోబెల్స్ కనుగొన్న విషయం ఇప్పుడు కూడా పని చేస్తూనే ఉంది. నిజంగా గొప్పవాడండీ!
శివ గారూ ఆ పదవేదో ఇప్పుడే ఇచ్చిపారేస్తే గొడవొదిలి పోతుందేమో కదా.

Anonymous said...

ఈ ప్రశ్నకి సమాధానం ఏక్తా కపూర్ ని అడిగి చెప్పాలి.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Sir, I don't know Ms.Kapoor's mail id.

సుజాత వేల్పూరి said...

నేనూ ఎప్పుడో చిన్నప్పుడు కొన్ని ఎపిసోడ్స్ చూశానండీ! ఆ తర్వాత ఓపిక లేక మానేశాను.

ఈ మధ్య ఒకరోజు చూస్తే పాత వాళ్ళెవరూ లేరు. రెండో తరం నడుస్తోందని మా అమ్మ చెప్పింది. ఆవిడ మంజులా నాయుడు సీరియల్స్ అన్నీ ఓపిగ్గా చూస్తుంది లెండి.

కానీ అది అయిపోలేదని అప్పుడప్పుడూ బ్లాగ్లోకంలో లేస్తున్న నిరసన జ్వాలల వల్ల తెలుస్తోంది.

Sree said...

అలాగని రెండూ చూస్తూ TV కి అతుక్కుపోయేరు? మీ కరెంట్ బిల్ల్ పెరిగి మీ జీవితం అంతమైపోతుంది జాగ్రత్త!!

voleti said...

అదీ యాక్షనే.. ఇదీ యాక్షనే.. ఎందుకలా ఆడిపోసుకుంటారు..పాపం..అంతగా చూడలేక పోతే నాలాగ టి.వీ కట్టేసి బబ్బోవచ్చుగా..

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Yes Voleti sir.You are right.

dhruva tara said...

మీరడిగిన కష్టమైన ప్రశ్నకు నాదగ్గర సమాధానం లేదు .ప్రజా సంపద లూటీ చేయడానికి తండ్రి కొత్త పధ్ధతులు కనిపెట్టినట్లే,ఈయన కూడా కొత్త పధ్ధతులు కనిపెడుతున్నాడు.దొంగ మీరు లేనప్పుడు మీఇంటికి కన్నం వేయకుండా మీదగ్గరకే వచ్చి మీ డబ్బు దొబ్బడానికి మిమ్ములనే తాళం అడిగినట్లుంది ఈ యాత్ర.జనం బలం చూపించి సోనియా ని భయపెట్టి,ముఖ్యమంత్రి పదవి కొట్టేసినా , అది కుదరకపోతే వేరే పార్టీ పెట్టినా అంతిమలక్ష్యం కుర్చీయే తద్వారా లూటీ అయ్యేది ప్రజా ధనమే .

Anonymous said...

Renduuuuuu.... janaalaki bore kottesaayiiii......Typo kaadu, mana Jagan annayya speechlu vini vini ila ayipoya :-( aa serial ni, eeyana gari yatra ni kuda "verri" abhimaanam unna vaallu tappa vere yevaru care cheyyadam ledu. Jagan annayya yaatra jarugutundo ledo Sakshi paper ni follow ayye maa sister ni adigi telusukunna monna ne. Gamanika: maa sister saaskhi ni comedy cinema choosinattu kevalam entertainment kosame chaduvutundi.