ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, పార్ట్1 చంద్రముఖిలో డాక్టర్ ఈశ్వర్ పాత్రలో రజనీ కాంత్ నాయకుడు. అందులో ఆయనకు అసిస్టెంట్ ఎవరూ ఉండరు. కానీ నాగవల్లిలో ఆయన శిష్యుడినని చెప్పుకొనే డాక్టర్ విజయ్(వెంకటేష్) హీరో. ఈ సినిమాలో అతనికి శిష్యుడిగా బ్రహ్మానందం నటించాడు. ఇప్పుడు అదే గురు శిష్య పరంపర కొనసాగితే మూడవ భాగంలో ఈ శిష్యుడు నాయకుడు కావాలి కదా?
కానీ వాస్తవంగా చూస్తే దయ్యాలు, ఆత్మలతో కామెడీని మిక్స్ చేసి చూపడం హాలీవుడ్‌లో బాగా విజయవంతమైన genre. Ghost busters, Scooby doo, Casper ఇలా చాలా ఉన్నాయి.
ఒక దయ్యంతోనో, ఆత్మతోనో బ్రహ్మి కామెడీని మేళవించి కొడితే అది నవ్వులు పూయిస్తే ఆ సినిమాకి ఢోకా ఉంటుందా?
2 comments:
మరే!బ్రహ్మానందానికేమి తక్కువా ?
wavvv..really?super idea by vaasu
Post a Comment