నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, December 27, 2010

స్కూలంటే ఇదీ అనిపించే మాంట్ ఫోర్ట్, యెర్కాడ్.

మాంట్ ఫోర్ట్ స్కూల్ యెర్కాడ్‌లో ఉన్న కోఎడ్యుకేషన్ సెకండరీ స్కూలు. ఈ వేసవిలో అక్కడికి వెళ్ళినప్పుడు చూడడం జరిగింది. మేము వెళ్ళినప్పుడు సెలవులు కావడం వలన స్కూలు మూసివేసి ఉన్నా, కొంత భాగం నిర్మాణంలో ఉన్నందు వలన లేబర్, కొంత సిబ్బందీ ఉన్నారు. గేటు ముందున్న వాచ్‌మేన్ మా కారు లోపలికి పోవడానికి ఒప్పుకోలేదు. సమయానికి స్కూలులోంచి బయటకి వస్తున్న ఒకాయన తన కారాపి వాచ్‌మేన్‌ని పిలిచి విషయం కనుక్కొని మమ్మల్ని లోపలికి పంపమని అతనితో చెప్పి, మేము థాంక్స్ చెప్పేలోపే తన కారులో బయటకి వెళ్ళిపోయాడు.

అది ఒక విశాలమైన బిల్డింగ్. విశాలమైన గార్డెన్. స్వంత జూ, ఆనుకొనే ఉన్న పెద్ద ఆట స్థలంతో స్కూలంటే ఇదీ అనిపించేలా ఉంది. స్కూలు ఆవరణలో ఉన్న గార్డెన్‌ని, జూని ఫోటోలు తీసి ఇక్కడ పెడుతున్నాను. 


రెవరెండ్ బ్రదర్ మేరీ దీనిని 1917లో అంగ్లో ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్‌గా స్థాపించారు.మొదట్లో ఇది కేవలం బ్రిటిష్ పిల్లలకే పరిమితమైనా తరువాత భారతీయులని కూడా చేర్చుకోవడం ప్రారంభించారు.


నగేష్ కూకునూర్ సినిమా రాక్‌ఫోర్డ్‌కి ప్రేరణ ఈ స్కూలు. నగేష్ ఈ స్కూలులోనే చదువుకున్నాడు. ఈ స్కూలు పూర్వ విధ్యార్ధుల లిస్టులో మాజీ కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి అన్బుమణి రామదాస్, మరొక మాజీ మంత్రి శశి థరూర్, క్రికెట్ క్రీడా కారుడు రోజర్ బిన్నీ కూడా ఉన్నారు. 


Virtue and labour అనేది ఈ స్కూలు మోటో.

2 comments: