ఇంకో మూడేళ్ళు ఓపిక పట్టండి ముప్పై సంవత్సరాలు వైఎస్ పాలన మీకందిస్తాను అని జగన్ ప్రతి మీటింగ్ లో చెప్తున్నాడీ మధ్య. ఒకసారి అధికారమొచ్చాక దాన్ని వదులుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అధికారంలో లేనివాడికి ఎప్పుడెప్పుడు దాన్ని సాధిద్దామా అని తపనగానూ ఉంటుంది. ఒకసారి పదవిలోకొచ్చాక దాన్ని వదులుకోకుండా ఎలా ఉండాలా అన్న విషయంలో దివంగత మహానేత చాలానే కృషి చేశాడు. కానీ చివరికి ఎన్నికలలో పీఆపీ ఓట్లు చీల్చడం వల్ల బొటాబొటిగా బయట పడ్డాడు.
అధికారంలోకొచ్చాక దాన్ని అంటిపెట్టుకోవడం చాలా సులభం. ఇది ఎలా చేయాలా అన్నది వైఎస్ గారి నుంఛే అందరూ తెలుసుకోవాలి.
మొదటిగా మనం నమ్మిన వాళ్ళనీ, మనకు నమ్మకమైన వాళ్ళనీ పార్టీలో, అసెంబ్లీలో పెట్టుకోవాలి. వాళ్ళని అన్ని విధాలుగా ఆర్ధికంగా పరిపుష్టి చేయాలి. ఇందుకు గనులు, కాంట్రాక్టులు,సెజ్ లూ, ప్రభుత్వ స్థలాలు మంచి సాధనాలు.
తరువాత ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలి. మన కోసమే మన నేత అన్న అభిప్రాయం కలిగించాలి. ఖజానా, అర్ధిక స్థితీ ఇలా లెక్క పెట్టకుండా ఎవరికి ఏం కావాలంటే అది ఇచ్చేయాలి. పెన్షన్లూ,ఫీజులూ, ఆరోగ్యశ్రీలు, ఉద్యోగశ్రీలు, మహిళశ్రీ, బాలబాలికశ్రీ...ఇలా జనాభాలో తొంభై అయిదు శాతానికి ఈ పధకాలు అందేలా చూడాలి.
ఈ పధకాలు నిజానికి పెద్ద బరువేమీ కాదు. ప్రభుత్వ ఆసుపత్రులకి అందించే నిధులని దారి మల్లించి కార్పొరేట్ ఆసుపత్రుల బాట పట్టిస్తే సరి. ప్రతి ఒక్కరికీ కార్పొరేట్ వైద్యం అందినట్టు ఉంటుంది. ఖజానామీద పెద్ద భారం కూడా లేకుండానూ ఉంటుంది.
ఇక నాయకుల సంగతి. కొంతమంది నిజంగా జనం సపోర్టు ఉన్న వాళ్ళుంటారు.మరి కొంతమంది ఒక్క ఓటు తెచ్చుకోలేని వాడు కూడా నాయకుడిగా చెలామణి అవుతూ ఉంటారు. ఇలా జనం తమ వెనుక ఉన్న వాళ్ళని ఎంచుకొని వాళ్ళకి అడిగినంత మేత వేస్తూ ఉంటే వాళ్ళు మనతోనే ఉంటారు.
2020 దాకా ముఖ్యమంత్రిగా ఉండాలని ఒక విజనూ, ప్లానూ రెడీ చేసుకున్న బాబు గద్దె దిగడం వైఎస్సార్ రెండవసారి గెలిచి సీఎమ్ కావడం, మరొక అయిదేళ్ళు కూడా గెలుస్తానని ధీమాగా ఉండడంలో మతలబేమిటా అని ఆలోచిస్తే, బాబు తను తిన్నది తనకో, తన పార్టీ వాళ్ళకో పంచిపెట్టాడు. అదే వైఎస్సార్ బాబు రూపాయి తిన్న చోట పది రూపాయలు తిని కొంత తన వాళ్ళకి పంచి అదే సమయంలో జనాలకి కొన్ని పైసలు విదిల్చాడు. వైఎస్ జన హృదయనేతగా, మహా నేతగా మాట తప్పని మడెమ తిప్పని నేతగా రూపొందడంలోని కిటుకు ఇదే.
ఈ రహస్యం తెలియని బాబు తను సీఎమ్ గా ఉండగా ఎంతసేపు ఐటీ, హైటెక్కు అని వేలాడాడు. ఐటీ బూమ్ లో లాభపడ్డవాడెవ్వడూ పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటెయ్యడు. ఒకవేళ వేసినా వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అదే వైఎస్ పథకాల వల్ల లాభపడ్డ ప్రతిఒక్కడూ ఓట్లేసే వాడే. ఇప్పుడు బాబు ఈ కిటుకు తెలుసుకున్నాడు కాబట్టి రైతులకోసం యాత్రలూ, దీక్షలూ చేస్తున్నాడు.
ఈ విధంగా అందినంత దోచుకొని, అందులో కొంత భాగం అడిగిన వాళ్ళకి అడిగినప్పుడు ఇస్తూ ఉంటే అవిచ్చిన్నంగా గద్దె మీద ఉండొచ్చు. ప్రజలు కూడా అవినీతికి పాల్పడడాన్ని ఒక తప్పుగా భావించే దశని దాటిపోయి, తింటే తిన్నాడు, మనకేమిచ్చాడు అని చూస్తున్నారు కాబట్టి గద్దెనెక్కాలన్నా, ఎక్కిన గద్దెని నాలుగు కాలాలు కాపాడుకోవాలన్నా ఇదే రాజమార్గం.
6 comments:
యథా ప్రజ తథా రాజా అంటే ఇదే మరి ... అవతలి వాడు ఎంతదోచుకుంటే మనకేంటి మన ముష్టి మనకు పడేస్తున్నాడు కదా అనుకుంటే ఇలాంటి పనికి మాలిన నాయకులే రాజ్యం చేస్తారు.
బాబు గారు ఇక ఏమి చేసినా ప్రజలు ఓటు వేయరు. ఆయన దగ్గర రేపటి ఎన్నికలకి ఖర్చు పెట్టటానికి అసలికి డబ్బులు ఉన్నాయో లేవో?
*అవినీతికి పాల్పడడాన్ని ఒక తప్పుగా భావించే దశని దాటిపోయి, తింటే తిన్నాడు, మనకేమిచ్చాడు అని చూస్తున్నారు *
ఈ స్థితి రావటానికి తె.దె. పార్టి నే కారణం. వారుమీడియా సహకారం తో చాలా పోష్ గా/ సైంటిఫిక్ గా /శాస్త్ర బద్దంగా దోచు కోవటం ఎలానో రాజకీయలాకు పరిచయం చేశారు. కాంగ్రెస్ వారి దగ్గర భుస్వామ్య పోకడలు ఎక్కువ, వారికి ఈ సైంటిఫిక్ విధానం మొదట అర్థంకా గందరగోళానికి గురి అయ్యారు. ఆ సైంటిఫిక్ విధానం ఎలా ఉంట్టుందంటే ఒకప్పుడు తెలుగులో ప్రతిఘటన లాంటి సినేమాలు తీసారు. ప్రజలలో రాజకీయ అవగాహన పెంచుతున్నట్లు నటించారు. కాంగ్రెస్ పార్టి నాయకులు ఎంత అవినీతి పరులో (కోటా శ్రీనివాసరావు పాత్ర ద్వారా )అని ప్రజలకి తెలియ జెప్పినట్లు ప్రజల దగ్గర మంచి మార్క్లు సంపాదించారు. కాని అసలు వారు వీటన్నిటిని తమ వ్యాపార లాభం కొరకు ఉపయోగించుకొన్నారు.
పేపర్ వ్యాపారాం చేతీలో ఉందిగదా దానిని సినేమాకి ఎక్కువ డబ్బులు సంపాదించుకోనేదుకు ఉపయోగించటం. ఆరోజుల్లో ప్రతిఘటన సినేమాను ప్రభుత్వం బాన్ చేస్తుందనే పుకార్లను పేపర్ ద్వారా వ్యాపింప చేసి జనాలను సినేమా చూడటానికి ఎగ బడేటట్లు చేశారు. అలా జనం ఎగబడుతున్న పుడు ఆసినేమా టికేట్లను బ్లాక్ లో అమ్మించి , తక్కు వ కాలం లో ఎక్కువ డబ్బు చేసుకోవటం. ఇది శాస్త్ర బద్ద దోపిడి. ప్రజలకు మంచి చేస్తునట్లు కనబడుతూ (creating awarnes) వారు మాత్రం డబ్బులు సంపాదించుకోవటం.
ఈ సైంటిఫిక్ దోపిడిని సమర్ధవంతం గా విరుగుడు కనిపెట్టిన మొదటి ఎకైక రాజకీయ నాయకుడు వై.యస్. మీడీయా వారి ని బ్లాక్ మైల్ కి గుండెను చూపిన వాడు. మీరు పైన రాసినవి ఆయన ఫాలో అయ్యాడు గనుకనే ప్రజలు మీడీయాలో వచ్చిన వాటిని పట్టించుకోకుండా క్రితం సారి వై.యస్. ను గెలిపించారు. లేక పోతే మీడీయా వ్యతిరేక ప్రచారం వలన ఆయన గెలవటం సాధ్యమేనా?
---------------------------
వై.యస్. సైంటిఫిక్ దోపిడి కళను అవగాహన చేసుకోవటమేగాక వాటిలో భుస్వామ్య లక్షణాలను జోప్పించాడు. ఆ భుస్వామ్య లక్షణాలు తె.దె. పా. కి స్వతహా గా లేవు కనుక వాటిని ఇప్పుడు అవలంబించలేదు. జగన్ పార్టితో పోటి పడలేదు.
SRI
జగన్ వలన తెలుగు వారి కి లాభమో నష్టమో నాకు తెలియదు గాని. భారత దేశానికి అతడివలన చాలా మేలు జరుగుతుంది. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టిని కేంద్రం లో అధికారం లోకి రాకుండా మాత్రం చేయగలడు. ఆంధ్రా నుంచి కాంగ్రెస్ తక్కువ యం పి సీట్లు మన జగన్ గారివలన వస్తాయి. ఇక కేంద్రంలో కాంగ్రెస్ పరిస్థితి రానున్న రోజుల్లో వెండి తెర మీద చూస్తాం.
SRI
Nice views from the author and the above anonymous reader.
Thanks
Cheekati,thanks. Thanks to you also SRI.
జాతినుత్తేజపరచి సమాజాన్ని ప్రగతి పథంలో నడిపిన అబ్రహాం లింకన్ లాంటి నాయకులగురించి,విద్వేషాలు రగిల్చి దేశాన్ని అధోగతి పాల్జేసిన హిట్లర్ లాంటి నాయకుల గురించి విన్నాం.సమాజం మొత్తాన్నీ అవినీతి కూపంలోముంచి,తెలుగు జాతిని తిరోగమన పథంలో నడిపించి ప్రజల ఆలోచన విధానాన్నే సమూలంగా మార్చిన రాశేరె లాంటి నాయకుల్ని ఈ రోజు చూస్తున్నాం.ప్రజాస్వామ్యం లొ we get the government we deserve.
Post a Comment