అనేక సంవత్సరాలుగా పత్రిక ముఖచిత్రాలుగా వచ్చిన అపురూపమైన వర్ణచిత్రాలని చందమామ వారు ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారు. శంకర్, చిత్ర, MTV ఆచార్య, వపా లు గీసిన రామాయణం,మహా భారతం, బుద్ధ చరిత్ర, ట్రాయ్ లలోని మధుర ఘట్టాలని అద్భుతమైన నాణ్యతతో ఒక పుస్తకంగా అచ్చు వేశారు. దీనిని వాళ్ళ వెబ్ సైట్‌లో ఆర్డరిచ్చి పొందవచ్చు.
ఆ చిత్రాలని చూసి వాటిని అందరికీ పరిచయం చేయాలన్న ఆలోచనతో నా సోనీ డిజిటల్ కెమెరాతో ఫోటోలు తీసి ఇక్కడ మీకందిస్తున్నాను. ఒరిజినల్ చిత్రాలలోని అందానికి న కెమెరా కానీ నా ఫోటొగ్రఫీ స్కిల్‌గానీ న్యాయం చేయలేక పోయాయి.
వపా గారు గీసిన ఈ బొమ్మ నా ఫేవరైట్. రుక్మిణిని కృష్ణుడు ఎత్తుకెళ్ళే సన్నివేశం అది. ఒకసారి చూడండి. కృష్ణుడు రుక్మిణిని ఎలా ప్రేమగా పొదివి పట్టుకొన్నాడో. ఆమె ఆయనని ఎంత అపురూపంగా చూసుకొంటూందో.
మరొక విషయం: ఈ బొమ్మల హక్కులన్నీ చందమామ వారివి. సదుద్ధేశంతో ఇక్కడ పెడుతున్నాను కాబట్టి కాపీరైట్ ఉల్లంఘన కింద వారు నామీద చర్య తీసుకోరని ఆశిస్తున్నాను.
chandamama.com అనె సైట్‌లో ఈ పుస్తకాన్ని ఆర్డర్ చేయవచ్చు. రెండు భాగాలుగా వచ్చే ఈ పుస్తకం వెల 1500 రూపాయలు.
No comments:
Post a Comment