నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, December 26, 2010

టీవీలో వెంకటేష్‌ని చూడగానే నాగవల్లి సంగతి తెలిసిపోయింది.

బ్లాగర్ మిత్రులు ఎంతమంది మొత్తుకున్నా నాగవల్లి చూడాలని టికెట్స్ బుక్ చేసి పెట్టుకొన్నాం ఆదివారం సాయంత్రానికి. బలి పశువులు కాబోతున్నామని ఒకవైపు తెలుస్తూనే ఉంది. అయితే నాగవల్లి మటాషన్న సంగతి ఆ సినిమా పైన వచ్చిన రివ్యూలకన్నా మరీ కొట్టొచ్చినప్పుడు తెలిసింది నిన్న సాక్షి టీవీలో వెంకటేష్‌ని చూసినప్పుడే.
  
ప్రతి అడ్డమైన సినిమాకి పనిచేసిన వాళ్ళను, నటులు కానీ టెక్నీషియన్స్ కానీ అన్ని ఛానల్స్ వాళ్ళు స్టూడియోల్లో కూర్చోపెట్టి కాలర్స్‌తో మాట్లాడించి వాళ్ళతో సూపరాతిసూపర్ అని బిరుదులిప్పించి హంగామా చేయడం సాధారణమే కానీ ఒక టాప్ హీరో అలా చేయడం మొన్న ఖలేజా సినిమాకి మహేష్ బాబు తరువాత ఇప్పుడు వెంకటేషే.
  
మామూలుగా ఇలాంటి వాటికి దూరంగా ఉండే వెంకటేష్ లాంటి హీరోలు ఇలా సినిమాల ప్రమోషన్‌లో పాలు పంచుకోవడం అబినందనీయమే. అయితే, ఇది నాగవల్లి సినిమా కలెక్షన్లు పెంచుకోవడానికి ఆ చిత్ర నిర్మాతలు ఎంత డెస్పరేట్‌గా ఉన్నారో తెలిపింది.


అయినా సరే మేం నాగవల్లి చూసే ప్రోగ్రాం కేన్సిల్ చేసుకోబోవడం లేదు. బెల్లంకొండకి మావంతు కంట్రిబ్యూషన్ మేం చేయబోతున్నాం.

5 comments:

ANALYSIS//అనాలిసిస్ said...

కొంపదీసి బెల్లంకొండది మనదీ సేం కమ్యూనిటీనా ?

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

బెల్లంకొండ కమ్యూనిటీ ఏమిటో నాకు తెలీదు. మిరు చెప్తే నేను సమాధానం ఇస్తాను. నా గెస్ అతను కమ్మ అని.అలా అయితే నేను ఆ కమ్యూనిటీ కాదు. అయినా మనం కులాన్ని దాటి ఆలోచించలేమా, బ్రదర్?

ANALYSIS//అనాలిసిస్ said...

నేను సీరియస్‌గానే జోక్ చేసాను బ్రదర్ ... ఎందుకంటే ప్లాపు సినిమా కూడా పనిగట్టుకుని చూస్తానంటే డౌటొచ్చింది ... దీనిని పట్టించుకోవద్దు ... Just for fun

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

It's ok boss.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

పోగాలము దాపురించిన వాడికి మంచి మాటలు వినిపించవు, రుచించవు, మంచి బ్లాగు పోస్టులు కనిపించవు.అదంతే!