నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, December 10, 2010

కొండక్కా, ప్రాజెక్టుల్లో, సెజ్ ల్లో జగనన్న వాటా ఎంతో చెప్పరాదే!!(కొండా సురేఖక్కకి ఒక లేఖ)

సురేఖక్కా, చాన్నాళ్ళకి ఒక మంచి పని చెసినావె. అందరూ కేవీపీ వైఎస్ ఆర్ ని అడ్డుపెట్టుకొని కోట్లు, కోట్లు దోచేశాడని అంటున్నా ఆ ఆరోపణలకి ఇన్నాళ్ళకి sanctity వచ్చింది నీ పుణ్యమా అని. కేవీపీని నువ్వు బాగా అడిపోసుకున్నావు నీ లేఖలో. వార్డు మెంబరుగా కూడా గెలవలేవురా నువ్వు అన్నావు చూడు అది అక్షరాలా నిజం. అస్సలు వార్డు మెంబరు దాకా ఎందుకు, అన్నకి వాళ్ళ పక్కింటోళ్ళు అయినా ఓట్లేస్తారన్న నమ్మకం లేదు. 
  
మొత్తానికి కోన్ కిస్కాగాడిని తీసుకొచ్చి ప్రజలమీద రుద్దాడు మన దివంగత మహానేత అని అంటావు. నీ నిజాయితీకి, నిర్భయత్వానికి హేట్సాఫ్! నిజమే కానీ అన్ని వేల కోట్లు ఆయన అలా దిగమింగుతున్నా రాజన్నకి అస్సలు తెలియదంటావు. చెప్పడానికి నీకు బావుందేమో కానీ, అంత నమ్మబుల్ గా లేదక్కా. 
  
మరొక విషయం జల యగ్నం ధన యగ్నంగా మారిందని చెప్పావు చూడు అది అక్షర సత్యం. కానీ నింద మొత్తం కేవీపీ మీదకీ, పొన్నాల మీదికీ తోసేయడం అంత సబబు కాదేమో! యువనేత కనుసన్నల్లోనే ఎక్సెస్ కాంట్రక్టులూ, బిల్లు చెల్లింపులూ జరిగాయని అందరూ పబ్లిగ్గానే చెవులు కొరుక్కొంటున్నారు కదా! 
    
ఇన్ని నిజాలు చెప్పిన దానివి జలయగ్నం కాంట్రాక్టుల్లో, సెజ్ ల మంజూరులో మన జగనన్నకి దేనిలో ఎంత వాటా దక్కిందో ఆ ముచ్చట్లు కూడా బయట పెట్టి పుణ్యం కట్టుకొంటే నిన్ను గాంధీ తాత చెల్లిగానో, మనవరాలుగానో చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖిస్తుంది. అంతే కాదు వికీలీక్స్ తో అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న అస్సాంజేతో సమంగా ప్రపంచం ఆకాశానికెత్తేస్తుంది. చూసుకో!!