నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, December 22, 2010

బ్లాగ్‌లోకం తరఫున నేనూ దీక్ష చేయబోతున్నాను. వచ్చే వాళ్ళెవరైనా ఉన్నారా?

ఈ మధ్య రాష్ట్రంలో ట్రెండుని బట్టి రాజకీయాలు నడుస్తున్నాయి. పోయిన సంవత్సరం గుండె ఆగి చనిపోవడం నడిచింది. తరువాత యాత్రల ట్రెండు, జగన్ ఓదార్పు, చంద్రబాబు బస్సు యాత్ర...ఇలాగా. ఇప్పుడున్నది నిరాహార దీక్షల ట్రెండు. ఒకవైపు బాబు ఆమరణ దీక్ష, మరోవైపు జగన్ లిమిటెడ్ దీక్ష. సరే, ఎప్పుడూ వాళ్ళు చేసే పనులని పొగిడి పూలదండలు వేయడమో, తిట్టి చెప్పుదెబ్బలు కొట్టడమో...ఇంతే కాకుండా మనం కూడా ఏదైనా చేసి చూపాలని అనిపించింది. నాకున్న మిత్రులు ఎక్కువ మంది బ్లాగ్ లోకంలోనే, బయటకన్నా కూడా. అందుకే నేను సైతం అంటూ ఒక నిరాహార దీక్ష చేపట్టాలని అనుకున్నాను.
 
 
జగన్ లాగా, బాబు లాగా వందల వేల సంఖ్యలో జన సమీకరణ చేసే సీన్ నాకు లేదు కాబట్టి ఇందు మూలముగా మీ అందరికీ విన్నవించుకోవడం ఏమనగా... బ్లాగ్ లోకం తరఫున మనందరం "నిరంతర పరిమిత నిరాహార" దీక్ష చేద్దాం. ఏమిట్రా వీడు దీక్ష పేరే ఇంత self- controdictary గా పెట్టాడు అనుకోవద్దు. Let me explain. ఇది జగన్ దీక్ష లాగా 48 గంటలో 96 గంటలో అని పరిమిత కాలం చేసే దీక్ష కాదు. రైతుల సమస్యలు ఆసాంతం తీరే దాకా కొనసాగుతుంది. అలా అని దీక్ష రోజంతా ఉండదు. రోజులో కొంతభాగం మాత్రమే దీక్షా కాలం. అంటే ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల దాకా, లేదంటే సాయంత్రం 5 నుండి 9 గంటల దాకా, లేదా దీక్షాకారుల సౌలభ్యాన్ని బట్టి రోజులో ఏ మూడో నాలుగో గంటలు చేస్తే చాలు.
  
అలాగే అందరూ ఒక చోట స్టేజి కట్టుకొని, కింద చాపలు పరుచుకొని చేయాల్సిన పని లేదు. ఎవరెవరి ఇళ్ళలోనో, ఆఫీసుల్లోనో, ఎక్కడ పని చేస్తుంటే అక్కడ దీక్ష చేబడితే చాలు. మధ్యలో కాఫీ, స్నాక్స్ కోసం బ్రేక్ తీసుకోవచ్చు. జగన్‌కి సాక్షి లాగా మనకి నెట్ ప్రపంచం ప్రొపగాండా కోసం పనికొస్తుంది. 

5 comments:

Anonymous said...

అయితే వాకే .నేన్ రెడీ

Anonymous said...

చంద్రబాబు దీక్షను చిరంజీవి ఏమీ అనకూడదు. మీరు మాత్రం వెటకారం చేయవచ్చా ?

మంచు said...

ఈరొజు మన రాస్ట్రం లొ దమ్మున్న ఎకైక మాగాడు జగన్ .

astrojoyd said...

If it is KCR-MARK r STYLE deekshaa means,iam eveready[night veg biryani+pomogrenet juice+fruit salad wth lime-tea

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఎవరినీ వెటకారం చేయడం కాదండీ. నా స్టైల్ దీక్ష ఇలా ఉంటుంది అని అంతే. అయినా అస్సలు ఏమీ తీసుకోకుండా దీక్ష అని ఎవరినైనా పిలిస్తే ఎలా చెప్పండి.