మహిళా సాధికారత, ఆడవారికి సమాన హక్కులు, చట్టసభల్లో రిజర్వేషన్లు ఇలా ఎన్ని వచ్చినా బీహార్ గడ్డమీద మాత్రం వాళ్ళు మొగుళ్ళ చేతిలో తన్నులు తినాల్సిందే అని చాటి చెప్పడానికా అన్నట్లు సాక్షాత్తూ JD(U) కి చెందిన ఒక రూలింగ్ ఎమ్మెల్యేని ఆమె భర్త, అతని డ్రైవర్ మరో ముగ్గురు కలిసి దాదాపు చచ్చెట్లు తీవ్రంగా కొట్టారు. చవుబతుకుల మధ్య ఉన్న ఆమె ఎస్పీకి ఫోన్ చేస్తే పోలీసులొచ్చి ఆమెని కాపాడి హాస్పిటల్లో చేర్చారు. అప్పటికే ఆమెకి కాలిలో చేతిలో ఎముకలు విరిగాయని ఎస్పీ విలేఖరులకి చెప్పారు.
బిమా భారతి బీహార్ లో, పూర్ణియా జిల్లాలోని రూపౌలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఈమె భర్త అవధేష్ మండల్ ఒక నొటోరియస్ క్రిమినల్ మరియు గాంగ్ స్టర్. మొన్న ఎన్నికలలో ఇతని మీద కోర్టులో కేసులు ఉండడంతో భార్యకి టిక్కెట్ తెచ్చుకొని గెలిపించుకొన్నాడు. ఇప్పుడు ఏమొచ్చిందో ఏమో గానీ ఆమెని ఇలా చావగొట్టాడు.
సాక్షాత్తూ చట్టాలని చేసేవారికే రక్షణ లేకపోతే ఇక మామూలు మహిళలకు రక్షణ ఎక్కడ. మరోసారి బీహార్ ఇప్పటికీ నాగరికతకి ఆమడ దూరంలో ఉన్నానని చాటి చెప్పుకొంది. రెండోసారి గద్దెనెక్కిన నితీష్ కుమార్ ఈసారైనా ఈ ముద్రని చెరిపేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తాడేమో చూడాలి.
1 comment:
భర్త పేరు చెప్పుకుని రాజకీయాలలోకి రావడం మహిళాభ్యుదయం ఎలా అవుతుంది? ఇక్కడ సబితమ్మ చేతకానితనాన్ని చూడలేదా? ఆమె పాలనలోనే మహిళలపై దాడులు పెరిగాయి.
Post a Comment