నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, December 21, 2010

స్టైలిష్ పొలిటీషియన్ చేస్తున్న డిజైనర్ దీక్ష

సినిమా హీరోల్లో, సౌత్ కానీ నార్త్ కానీ, రజనీ కాంత్ స్టైలే సెపరేటు. తెర బయట సాదాసీదాగా కనిపించినా కెమెరా ముందుకొస్తే స్టైలుకి పర్యాయపదంలా ఉంటాడు. పాత్ర ఏదైనా వేషమేదైనా సరే. బాషాలో ఆటోడ్రైవర్ పాత్రలో అయినా డాన్ పాత్రలో అయినా, అరుణాచలంలో పల్లెటూరివాడిగా, సిటీకొచ్చి కోట్లతో ఆడుకొనేవాడిగా ఇలా సినిమా ఏదైనా, పాత్ర ఏదైనా స్టైలంటే రజనీ, రజనీ అంటే స్టైల్ అనేలా ఉంటాడు.
  
రాజకీయాల్లో ఇలా స్టైల్ మెయిన్ టెయిన్ చేసే వాళ్ళు ఇంతవరకూ లేరు. వైఎస్సార్ హుందాగా పంచె కట్టినా, చిరంజీవి రోజుకో డ్రెస్సు వేసి ఇంపోర్టెడ్ వాచీలతో కనిపించినా స్టయిల్ ని అణువణువునా నింపుకొని ప్రతి పనిలో స్టయిల్ కనిపించేలా ఎవరూ లేరు. ఇప్పుడా లోటు జగన్ మోహన్ రెడ్డి భర్తీ చేస్తున్నాడు. జగన్ ఏం చేసినా స్టైలే! ఓదార్పు యాత్ర నుంచీ లక్ష్య దీక్ష దాకా ఇది కొట్టొచ్చినట్టు, తన్నొచ్చినట్టు కనిపిస్తూంది.


కుటుంబంలో చనిపోయినవాడి గురించి విచారింపు జరిపి, పుట్టెడు(?) బాధలో ఉన్న వారిని ఓదార్చేందుకు వెళ్ళినప్పుడు కూడా ఏదో ఒకరిద్దరితో చడీ చప్పుడూ లేకుండా వెళ్ళలేదు. టీవీ కెమెరాల నిరంతర పర్యవేక్షణలో, అనుచర గణం వెంటరాగా, ఒక భారీ కేన్వాయ్‍తో రాజు, సారీ, యువరాజు వెడలె రవితేజమలరగా అన్నట్టు వెళ్ళాడు.
 
అలాంటిది యువరాజా వారు నిరాహార దీక్షకి కూర్చుంటే అది ఎలా ఉండాలి. సాదా సీదాగా ఒక చాప కింద, గుడారం పైన వేసి ఒక అయిదో, పదో మందితో చేస్తే అందులో స్టైలేముంటుంది?


అందుకే బ్యాక్‍డ్రాప్ కూడా మంచి పిక్చరెస్క్ లొకేషన్, కృష్ణా నదీ తీరాన్ని ఎంచుకొని, సినిమాల్లో గ్రూప్ డాన్స్‌లో ఉన్నట్టుగా చుట్టూ ఒక పెద్ద ట్రూ‍ప్‌తో మొదలు పెట్టారు. కింద ఒత్తుకోకుండా మెత్తని వేదిక, పైన ఎండ సోకకుండా పైకప్పూ, ఎక్కువ రోజులు దీక్షచేసి ఆరోగ్యం పాడు చేసుకోకుండా 48 గంటలు అని టైమ్ ఫిక్స్ చేసి అనుచరులని కూడా ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త పడ్డారు.
 
ఇక ఈ రెండు రోజులూ సహ దీక్షాకారులకి సమయం తెలియకుండా, విసుగు రాకుండా గానా భజానా ఉంటాయేమో. అందుకోసం ధర్మవరపు, విజయచందర్ ఎలాగూ ఉన్నారాయే. మధ్యలో కాస్సేపు రోజాతో డాన్సు చేయిస్తే సూపరో సూపర్. ఇక కామెడీ కావాలంటే రాజశేఖర్(సినిమా హీరో) ని పిలిచి అరగంట పాటు తెలుగులో మాట్లాడమంటే జనానికి నవ్వులే నవ్వులు. 


దీక్ష పూర్తయ్యాక అందరికీ పసందుగా, షుష్టుగా పలహారం. దోశె, చికెన్, వడా, ఇడ్లీ,సాంబార్ ఇలా ఎవరికేది కావాలంటే అది ఇచ్చి ఈ 48 గంటలూ ఖాళీగా ఉన్న కడుపుని నింపేస్తే పెర్ఫెక్ట్ క్లైమాక్స్ అవుతుంది.
  

మరదీ స్టైలంటే! స్వాతంత్ర్యం రాకముందు గాంధీ అనే ఒక బక్కచిక్కిన ముసలాయన దగ్గర్నుంచీ నిన్న చంద్రబాబు నాయుడి వరకు కొన్ని వందల మంది నిరాహార దీక్షలు చేసి ఉంటారు. ఇంత స్టైల్ ఎవరయినా చూపించారా??!!


 
Now, that's style.
   

4 comments:

Anonymous said...

ఇక కామెడీ కావాలంటే రాజశేఖర్(సినిమా హీరో) ని పిలిచి అరగంట పాటు తెలుగులో మాట్లాడమంటే జనానికి నవ్వులే నవ్వులు.

keka

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Thank you sir.

Sree said...

మన దేశం లో పనీ పాటా లేకుండా ఎంతమంది ఉన్నారో ఈ నాయకుల దీక్షలు, ఓదార్పులు, శవయాత్రలు చూస్తేనే అర్థం అవుతుంది. ఇంతమంది బోకుగాల్లు ఉన్న దేశం ఎలా బాగుపడుతుంది?

tarakam said...

వందిమాగధుల చేష్టలకు జనానికి నవ్వు వస్తుంది.యువరాజుకు కొంతైనా కొవ్వు కరుగుతుంది.