కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళాక జగన్ కానీ అతని అనుచరులు కానీ తరచుగా లేవనెత్తే అంశం "పార్టీకోసం నా తండ్రి అంత కష్టపడితే నన్నిలా అన్యాయం చేయవచ్చా?" అన్నది.
ఒకసారి కూల్ గా ఆలోచిస్తే వైఎస్ కి గానీ ఆయన కుటుంబానికి గానీ దక్కిన పదవులూ, ఆస్తులూ లెక్క పెడితే ఎవరయినా కళ్ళు తేలవేయక మానరు.
రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఆనవాయితీకి పూర్తి భిన్నంగా. ఆనవాయితీ తప్పి పార్టీ మీద ప్రభుత్వం మీద పూర్తి అదుపునిచ్చారు హైకమాండ్ జోక్యం లేకుండా. మొదటి సారి వివేకానంద రెడ్డికి కడప పార్లమెంటు సభ్యత్వం ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి బావమరిదిని కడప మునిసిపల్ చైర్మన్ని చేశారు.
ఇక ఆస్తుల చిట్టా ఎవరూ లెక్క చెప్పలేనిది. జగన్ బాబుకి ఒక సిమెంటు ఫాక్టరీ, అనేక రాష్ట్రాల్లో పవర్ ప్లాంటులు, ఇక రాష్ట్రంలోని సెజ్ లన్నింటిలో జగన్ గారికి పర్సెంటేజీ అందాయన్నది బహిరంగ రహస్యం. జగన్ గారి మీడియా సామ్రాజ్యం అందరికీ తెలిసిన విషయమే. బావమరిది రవీంద్రనాధ్ రెడ్డిగారి హైదరాబాద్ లోని భూకబ్జాలు విలువ కడితే వందల కోట్లు లెక్క తేలుతాయి. ఇక అల్లుడు బ్రదర్ అనిల్ కి కట్తబెట్టిన బయ్యారం గనులూ, బంధువులకి, సన్నిహితులకీ, అనుచరులకీ, చెంచాలకీ ఇలా ఇవన్నీ లెక్క తేల్చాలంటే జెమా జెట్టీల్లాంటి అకౌంటెంట్లు కావలసిందే!
అంతెందుకు ఇప్పుడు మీకోసం వీధుల్లోకొచ్చి ధర్నాలు గట్రా చేసేవాళ్ళు, సోనియా, ఇందిరా,నెహ్రూ బొమ్మలు తగలబెట్టేవాళ్ళు, వీళ్ళలో కొందరు స్థానిక నాయకులు డబ్బులిచ్చి తెచ్చిన వారున్నా, అభిమానం కొద్దీ వచ్చేవాళ్ళు కొందరైనా ఉంటారు కదా- వాళ్ళని పార్టీ ప్లాట్ ఫామ్ లేకుండా తమరి తండ్రి గారు సంపాదించగలిగి ఉండే వారా?
ఒక్క మాటలో చెప్పాలంటే 2004 లో కేరాఫ్ ప్లాట్ ఫామ్ అయిన తమర్ని ఈరోజు తండ్రిగారు ఒక రాష్ట్రాన్ని శాసించేస్థాయిలో ఉంచారంటే ఇంతకన్నా ఎవరైనా ఏమివ్వాలి సార్?
సరే, ముఖ్యమంత్రి పదవి మీ నాన్నగారి తరువాత మీకు దక్కవలసిందే. సోనియమ్మ పుణ్యమా అని తప్పిపోయింది. దానిని ఖండించాల్సిందే! అంతవరకూ బాగానే ఉంది. స్వాతంత్ర్య పోరాటంలో ఆస్తులన్నీ కోల్పోయి చివరికి బికార్లుగా మిగిలిపోయినా ఫీలింగ్ పెట్టడమే అంత బాగాలేదు.
2 comments:
A must read article:
http://telingana.wordpress.com/2010/02/25/దేశభాషలందు-ఆంగ్లమే-లెస్స/
అదో తీరని ఆకలి , దాహం బాబూ,
Post a Comment