నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Saturday, December 11, 2010

రాగిణి MMS- ఏక్తా కపూర్ నిర్మించబోయే హార్రర్ సినిమా!

ఇద్దరు ప్రేమికులు తమ శృంగారాన్ని కెమెరాలో బంధించాలనుకొని సెల్ ఫోన్ స్విచాన్ చేసి శృంగారానికి ఉపక్రమిస్తారు. అయితే అంతలోనే ఆమెలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయి. ఏదో ఆత్మ ఆమెని ఆవహిస్తుంది. ఈ పరిణామానికి వాళ్ళు బిత్తర పోతారు. ఆ సీన్ ని వాళ్ళు బాలాజీ టెలి ఫిలింస్ అధినేత్రి ఏక్తా కపూర్ కి చూపించారు. టీవీలలో అసజమైన పాత్రలతో, అసంబద్ధమైన సన్నివేశాలతో నిండిన సీరియళ్ళు నిర్మించే ఏక్తా ఆ సీన్ చూసి దాని ఆధారంగా రాగిణి MMS అన్న సినిమా ప్లాన్ చేసి స్క్రిప్టు సిద్ధం చేయించింది.
   
అయితే ఇందులో అనవసర డ్రామా ఉండదని ముందుగానే చెప్పింది ఏక్తా. ప్రధాన పాత్ర పోషించడానికి కంగనా రనౌత్ ని అప్రోచ్ అయ్యిందట ఏక్తా. ఆమె ఒప్పుకుంటే త్వరలో షూటింగ్ మొదలౌతుంది. paranormal activity, blairwitch project లాంటి హాలీవుడ్ సినిమాలలాగ ఈ సినిమా ఉంటుందని ఏక్త అంటూంది.  ఈ సినిమాకి పవన్ క్రిపలానీని దర్శకుడిగా ఎంచుకొంది కపూర్. ఈ సినిమాకి పబ్లిసిటీ, మార్కెటింగ్ కూడా డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేస్తుంది ఈ క్వీన్ ఆఫ్ టెలీ సీరియల్స్.
  
క్యారీ ఆన్ ఏక్తా కపూర్. టీవీ మసాలా సీరియల్స్ నుండి నీక్కూడా కొంత ఆటవిడుపులాగా ఉంటుందిలే ఈ సినిమా.

No comments: