నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, December 17, 2010

చంద్రబాబు దీక్షపై చిరంజీవి వ్యాఖ్యలు సమంజసమా?

చంద్రబాబు నాయుడిని రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలదు అన్న సామెత నిజం చేయడానికా అన్నట్లు రెండు విషయాలు వెంటాడుతున్నాయి. ఒకటి వెన్నుపోటు దారుడు అన్న ముద్ర. దేశ రాష్ట్ర రాజకీయాల్లో వెన్నుపోటుదారులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు, ఈయనొక్కడే కాదు, వెన్నుపోటు అనేది ఈయనతో మొదలు కాలేదు, ఈయనతో ముగిసిపోనూ లేదు అని లోగడ ఇక్కడే తారకం గారు సోదాహరణంగా ఒక పోస్టులో నిరూపించారు.http://tarakam55.blogspot.com/2010/10/blog-post_27.html అయినా కంగ్రెసోళ్ళు మటికొస్తే దానినే పదే పదే బయటికి తీస్తున్నారు.
 
ఇక రెండవది లోగడ తాను ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయం దండగ అని అన్న మాట. ప్రపంచ బ్యాంకు పే రోల్ లో ఉన్నప్పుడు ఆయన అలా అని ఉండవచ్చేమో గానీ దాన్ని ఈనాటికీ ఆయనకి వ్యతిరేకంగా బయటికి తీస్తున్నారు. ఈరోజు తాజాగా బాబు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షని కామెంటు చేస్తూ చిరంజీవి మళ్ళీ దాన్ని బయటకి లాగి "ఆనాడు ఆ మాట అన్న పెద్ద మనిషి ఇప్పుడు రైతుల కోసం దీక్ష చేపట్టడం అధికారం కోసం కాదా అని" ప్రశ్నించాడు.
 
ఈ కాంటెక్స్ట్ లో చిరంజీవిని రెండు ప్రశ్నలడగదలచాను. మొదటిది రాజకీయం అంటేనే మాటలు మార్చడం కాదా? పార్టీ పెట్టిన తొలి నాళ్ళలో కాంగ్రెస్ పార్టీని మీరూ మీ వాళ్ళూ దుమ్మెత్తి పోయలేదా, పంచలు ఊడదీసి మరీ కొట్టాలని తమ్ముడుంగారు మీ శ్రేణులకి పిలుపు నివ్వలేదా? ఇప్పుడు అదే కాంగ్రెస్ వాళ్ళు మీకు అత్యంత ఆప్తులయిపోలేదా? అవసరం అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్ధతునిచ్చి కాపాడడానికైనా సిద్ధం అని మీరు ప్రకటించలేదా?
 
రెండవది అధికార సాధన తప్ప రాజకీయ పార్టీలకు, కలియుగంలో అధికారం సాధించడానికి ఏ మాత్రం అవకాశం లేని లోక్ సత్తా లాంటి వాటికి తప్ప, మరొక అజెండా ఏదైనా ఉందా? తమరు పార్టీ పెట్టిన మొదట్లో అధికారం సాధించేస్తామని పగటి కలలు కనడం వల్లనే కదా మన బావగారు ఓపెన్ చేసిన కౌంటర్ కనీ వినీ ఎరుగని రీతిలో టికెట్ల అమ్మకాలు సాగించడం సాధ్యమయింది.


కాబట్టి చిరూ, రాజకీయాల్లో అభిప్రాయాలు మార్చుకోవడం సహజమే, రాజకీయాలు అధికార సాధనకే. కాదని ఎవరైనా అతను అబద్ధమైనా చెబుతుండాలి, లేదంటే అతను జయప్రకాష్ నారాయణ్ అయినా అయ్యుండాలి(రెండో పాయింట్లో).

18 comments:

Kiran said...

Seva ani vachchina manishi chestunna seva ento ?

Anonymous said...

చేతకానమ్మకు కూతలు మెండు

చిలమకూరు విజయమోహన్ said...

కాస్తుండండి,నేను పోలవరంపై ప్రధానితో మాట్లాడటానికి ఢిల్లీ వెళ్తున్నా వచ్చిన తర్వాత సమాధానం చెబుతా.

சித்தூர்.எஸ்.முருகேசன் said...

// చిరులో ఇప్పటికీ రియలైజేషన్ రాలేదు. సోనియా ఇంటి గూర్కా లా మాట్లాడుతున్నారు. కనీశం బాబు జగన్ అన్నా పరస్పర అవగాహణతో మెలగాలి. కనీశం దిల్లి పెత్తనానికి తెర పడేంత వరకైనా//

For more:
http://hittingontheface.blogspot.com/2010/12/blog-post_17.html

Anonymous said...

Please change your blog name as shit on my face.

It would be suitable for you and you articles.

astrojoyd said...

మీరంతా చిరుని మరీ చిన్నపిల్లాడిని చేసి ఆడుకుంటున్నారు.ఆ చిరుకి ఈ ఆట కొత్త్హకాదులెండి.మొదట్నుంచీ వాళ్ళ బావ అరవింద్ ఆదిస్త్తూనే ఉన్నాడుకాబట్టి సరిపోయింది,లేకుంటే ఈ పాటికే మీ ఎదుట బేర్ మనేవాడు[మాటలు మార్చే ఆట]

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

5th anonymous, if you can't compose a decent comment either for or against this or any topic, why don't you shut your bloody **--@# and close your computer? Blogging or commenting is for someone who has even some microscopical quantity of grey matter in their bloody brains.

tarakam said...

నా పోస్ట్ లింక్ ఇచ్చి , నావాదనకు బలం చేకూర్చినందుకు ధన్యవాదాలు.తమ పేరుతో వ్యాఖ్యలు చేయలేని పిరికి పందులకు ...సారీ పందలకు తాము రోజూ తినేదే నొట్లో నానడం సహజం.అటువంటి జీవులకు సానుభూతి చూపించండి.ఉద్యోగస్తుడు ఉద్యోగం చేయక,వ్యాపారస్తుడు వ్యాపారం చేయక,రాజకీయనాయకుడు రాజకీయం చేయక ఏమి చేస్తారో నాకేమీ అర్థం కావటల్లా.

Anonymous said...

ఆ ముక్క తమరు అనకూడదండి చెప్పుదెబ్బలుగారూ...అంటేగింటే తెలుగుదేశంవాళ్ళనాలి, లేదా చంద్రబాబునాయుడనాలి. ఒక్క మాట సూటిగా చెప్పండి. చిరంజీవి ఆ విధంగా చంద్రబాబును వ్యాఖ్యానించడంవలన మీకెందుకు ఆవేదన కలగాలి. వాళ్ళు రాజకీయనాయకులని, చంద్రబాబు మాట మార్చడం రాజకీయమని మీరే చెబుతున్నారు. మరి చిరంజీవి కూడా ఇప్పుడు రాజకీయనాయకుడేకదా. అయినా రాజకీయనాయకులు లక్ష తిట్టుకుంటారు...అవసరమైతే మళ్ళీ కలుసుకుంటారు. మీకేమిటి అభ్యంతరం?


మార్కెట్లో అమ్మకందారులు పోటీపడినప్పుడు లాభపడేది కొనుగోలుదారు. అలాగే రాజకీయనాయకులు కొట్టుకుంటే ఒకళ్ళ గుట్లు ఒకళ్ళు బయటపెట్టుకుంటారు...ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు.(అంటే సామాన్యులు లాభపడినట్లేకదా!) మరి ఇది మంచి పరిణామమే కదా...మరి మీకెందుకు అసమంజసం అనిపించిందో వివరించండి. తెలుసుకుని తరిస్తాము.

మీరు, తారకంగారు, చాకిరేవుగారూ, శ్రీగారూ...(అంతా ఒకళ్ళను ఒకళ్ళు సమర్ధించుకుంటుంటారు. అసలు ఒకరే వేర్వేరు పేర్లతో ఇలా బ్లాగులు రాస్తూ కూడా ఉండొచ్చు)మీరంతా ధైర్యంగా తెలుగుదేశం మద్దతుదారులమని ఎందుకు ప్రకటించుకోరు?

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

తెలుగు దేశానికి నాకూ ఏమాత్రం సంబంధం లేదు. సరికదా నాకు బాగా కావలసిన వాళ్ళు కాంగ్రెస్ లో వివిధ స్థాయిల్లో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగితే నాకు అన్ని విధాలా లాభం. నేను రాసింది వ్యక్తిగత లాభనష్టాల కోసం గానీ, అభిప్రాయాలతో గానీ కాదు. గమనించగలరు.అలాగె తారకంగారిని నెట్ లో తప్ప మరేవిధంగానూ నేనెరుగను.

The One said...

@ 5TH ANONYMOUS -- "Please change your blog name as shit on my face.
"
Yeah thats exactly how a person would feel like($&*%$ on your face) after lookin at your nasty comments , seems like you took the article too personally ,maybe you should go back to the basics and learn how to compose a decent reply.

@Krishna Garu-

chiru is like the Gajni of AP politics,I'm sure he would not remember what he spoke about if he was asked to repeat the same lines after 30-40 minutes. Good to see some counter attack from TDP camp after a long long time.

Anonymous said...

చెప్పుదెబ్బలుగారూ, కాంగ్రెస్ తోనే మీకు అంత లాభముంటే చంద్రబాబు నాయుడుపట్ల మీకు అంత దయ, సానుభూతి,ఔదార్యమెందుకో వివరించగలరు.

ఏ ఎండకా గొడుగు పట్టే కమ్మటి మాటలు ఎన్ని చెప్పినా లోపల మాత్రం చంద్రబాబంటే ఆ అభిమానం ఉండటం సహజమేలెండి మీరేమీ తప్పుగా ఫీలవకండి.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Last anonymous, can't you think beyond caste lines?

Sree said...

క్రిష్ణ గారికి చంద్రబాబుపై కూసంత అభిమానం ఉండొచ్చేమో గాని ఆ సాక్షి చానల్ కంటే ఈయన బ్లాగులు మంచివే లెండి. ఇక జయప్రకాష్ నారాయణ్ అంటారా? అతని నిబధ్ధత మీద మనకు నమ్మకం ఉంటే ఈసారి ఆ పార్టీకి ఓట్లేద్దాం. గెలుపు ఓటములు కావు ముఖ్యం, మన అభిప్రాయం తెలపటం కదా ముఖ్యం.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

అయ్యొ రామా!ఈ పోస్టులు ఎవరిపైనా అభిమానంతో రాసినవి కాదంటే నమ్మరేం స్వాములూ?

రాజేష్ జి said...

$
"అయ్యొ రామా.. ఎవరిపైనా అభిమానంతో రాసినవి ..నమ్మరేం స్వాములూ?
"

నాకు డౌటే!

రాజేష్ జి said...

:))

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Can't help it boss.