నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, December 16, 2010

ఈ రీతిలో పేషంట్లుంటే కార్పొరేట్ హాస్పిటళ్ళు మాత్రం దోచుకోక ఏం చేస్తాయి పాపం?!

చాలా కాలం తరువాత హైదరాబాద్ వదిలి ఊరికి వెళ్ళాను, మా మామ కొడుక్కి యాక్సిడెంటు అయి ఆపరేషన్ చేయించుకున్నాడని తెలిసి పలకరించడానికి వెళ్ళాను. వాడు ఇంజనీరింగ్, ఎంబీయ్యే పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. పైసా సంపాదన లేకపోయినా బైకూ, ఫ్రెండ్సూ, షికార్లు ఇలా కాలక్షేపం చేస్తూ ఉండగా ఒకరోజు చీకట్లో బైకు మీద పోతూ ఉండగా యాక్సిడెంటు అయ్యిందని చెప్పాడు మామ. "మద్రాసులో ఆపరేషన్ చేయించాంరా, అటూ ఇటూగా రెండు లక్షలయ్యింది."
  
నాకర్థం కాలేదు.అదే ఊరిలో నా కజిన్ ఎముకల డాక్టరుగా విరిగిన ఎముకలకి రాడ్లూ, బోల్టులూ బిగించే పనిలో ఉన్నాడు. బాగానే ఆపరేషన్లు చేస్తాడన్న పేరుంది కూడా. "మనవాడున్నాడు కదా మామా, మద్రాసుకెందుకు పోయారు?" అనడిగాను. "ఏమోరా. అందరూ మద్రాసుకి తీసుకుపోదాం అన్నారు. అక్కడయితే బావుంటుందని తీసుకెళ్ళాం. ముందు డెబ్బయి వేలవుతుందని తీరా డిస్చార్జి టైమ్ లో రాడ్దుకే ముప్పయి అయిదు వేలు బిల్లేసి, మందులూ అవీ ఇవీ అని లక్షా అరవై అయిదు వేలు వదిలించారు.ఇక బయట ఆ ఖర్చులు ఈ ఖర్చులూ కలిపి రెండయింది" అన్నాడాయన.
  
అప్పుడు నాకనిపించింది ఊరికే దోచేస్తారు, దొబ్బేస్తారు అని కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళని ఆడిపోసుకోవడమెందుకు అని. ఉన్న ఊరిలో తక్కువ ఖర్చుకి వైద్యం లభిస్తున్నా నక్షత్రాల ఆసుపత్రులకి పోతే వాళ్ళు చుక్కలు చూపించకుండా ఊరికే వదుల్తారా?
  
నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలలో ప్రతి చిన్న దానికీ మద్రాసుకి పోవడం, అక్కడ ఎదో ఒక స్టార్ హాస్పిటల్లో లక్షలు సమర్పించుకోవడం పరిపాటి. ఈ రోగం నెల్లూరోళ్ళకి మరీ ఎక్కువ. లోకల్ డాక్టర్ దగ్గర జ్వరమయినా రెండో రోజుకి తగ్గక పోతే అంబులెన్సు ఎక్కేసి ఏ విజయాకో, అపోలోకో పొలో మంటూ పోయి క్షవరం చేయించుకొని వస్తారు. కేవలం డబ్బున్న వాళ్ళే కాదు, డబ్బుకి ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఈ కేటగిరీలో ఉంటారు.

వాళ్ళని చూసి బాధ పాడాలో, తిక్క కుదిరిందని అనుకోవాలో తెలియదు.

8 comments:

Anonymous said...

Mitrama.. ala nellorians ni point cheyadam emi bagolEdu...

Asalu nellorE oka pEdda medical center hub ga maaripoyindi..

so, mee vyakhyalani meeru venakki tessukOvaali.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

మీకు నెల్లూరులో తెలిసిన డాక్టరు ఎవరైనా ఉంటే, ప్రత్యేకించి జనరల్ సర్జన్ లేదా ఆర్థోపెడీషియన్ ాయితే మరీ మంచిది, ఆయనతో ఈ టాపిక్ మీద మాట్లాడి అప్పుడు రండి. చూద్దాం. నా అభిప్రాయం నూటికి నూరు పాళ్ళూ నిజమని మీకు వాళ్ళు చెప్తారు.

chanukya said...

Anonymous గారి comment ను చదువుతూఉంటే నాకు ఎందుకో తెలంగాణ KCR మాట్లాడుతున్నట్లే అనిపించింది!!ఒకటి మటుకు నిజం,మద్రాసు విజయా గాని,అపోలో గాని విజయవంతంగా నడుస్తున్నాయంటే అది నెల్లూరు,ప్రకాశం మరియు చిత్తూర్ ప్రజల వలనే అని చెప్పడంలో సందేహం ఏమీ లేదు.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

నాకు బాగా తెలిసిన ఒక నెల్లూరు పేషంటు మద్రాసులో ఒక స్టార్ హాస్పిటల్లో రెండున్నర లషలు ఖర్చు పెట్టి రెండు సార్లు ఆపరేషన్ చేయించుకొని అది ఫెయిలయ్యి చివరికి పాతిక వేలతో నెల్లూరులోని ఒక డాక్టరు దగ్గర ఆపరేషన్ చేయించుకొని బయట పడ్డాడు. దీనిమీద ఒక పోస్టు పెడతాను త్వరలో.

karthik said...

ఆయ్, కడప జిల్లా వాళ్ళు మాత్రం తక్కువనుకుంటున్నారా?? కానే కాదు.. మద్రాస్ ఆసుపత్రులలో మావాళ్ళ సంక్య త్క్కువేమీ కాదు.. డైరెక్ట్ రైళ్ళు ఉన్నాయి కదా.. అవి ఎక్కి పోలోమని పోతూ ఉంటారు.. అదొక నమ్మకం.. అందులో కడప నగరం లో చాలా విభాగాలకు మంచి డాక్టర్లు లేరు.. అదొక పెద్ద సమస్య..

Praveen Mandangi said...

దక్షిణ ఒరిస్సా వాళ్లైతే వైజాగ్ కార్పరేట్ ఆసుపత్రులకి వస్తుంటారు. దక్షిణ ఒరిస్సాలో బరంపురం తప్ప మిగిలిన ప్రాంతాలన్నీ గిరిజన ప్రాంతాలు. బరంపురంలో కూడా మంచి డాక్టర్లు ఉన్నారు కానీ మిగిలిన ప్రాంతాలవాళ్లు ఎక్కువగా వైజాగ్ వెళ్తుంటారు. నెల్లూరు ట్రైబల్ ఏరియా కాదు. మా బాబాయి గారు గూడూరులో పని చేసే రోజుల్లోనే నెల్లూరు సిటీలా ఉండేది. అక్కడివాళ్లకి స్థానిక వైద్యుల మీద నమ్మకం లేదా? ఒరిస్సాలోని గజపతి జిల్లాకి చెందిన పేషెంట్లు మా శ్రీకాకుళం డెంటల్ కాలేజికి కూడా వస్తుంటారు. మా జిల్లా కూడా వెనుకబడిన ప్రాంతమే కానీ దక్షిణ ఒరిస్సా అంత కంటే వెనుకబడిన ప్రాంతం. శ్రీకాకుళం డెంటల్ కాలేజి ఓనర్లు ఇతర డాక్టర్లతో కలిసి మెడికల్ కాలేజి కట్టారు. వెనుకబడిన ప్రాంతాలలో ఆసుపత్రులు, మెడికల్ కాలేజిలు కట్టినా పేషెంట్లు వస్తారు. వచ్చేవాళ్లు అంత కంటే వెనుకబడిన ప్రాంతం నుంచి వస్తారు.

Anonymous said...

@అప్పుడు నాకనిపించింది ఊరికే దోచేస్తారు, దొబ్బేస్తారు అని కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళని ఆడిపోసుకోవడమెందుకు అని. ఉన్న ఊరిలో తక్కువ ఖర్చుకి వైద్యం లభిస్తున్నా నక్షత్రాల ఆసుపత్రులకి పోతే వాళ్ళు చుక్కలు చూపించకుండా ఊరికే వదుల్తారా?.....
you r 100% correct sir...asalu samasya antaa ee extraa cutting icche patients tho ne...

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Thank you kssv.