నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, December 14, 2010

ప్రమాదం వైరస్ వల్ల కాదన్నయ్యా!

ఆ మధ్య ఎన్నో అంచనాలు పెట్టుకొని నిర్మించిన ఆరంజ్ సినిమా మటాషయ్యే సరికి ఉక్రోషం పట్టలేక మెగాతమ్ముడు నాగబాబు దర్శకుడు భాస్కర్ ని, ఆ బాపతు దర్శకులనీ వైరస్ లతో పోల్చి ఏకేసిన సంగతి అందరికీ తెలిసిందే. తరువాత దానికి వెంకటేష్ తనదైన పద్ధతిలో సమాధానం కూడా చెప్పాడు తప్పు ప్రాజెక్ట్ ని అదుపులో పెట్టుకోలేని నిర్మాతలదే అని.  
 




  
ఈ సందర్భంగా నేను నాగబాబుకి ఒక బయలాజికల్ సూత్రాన్ని చెప్పాలనుకొంటున్నాను. సూక్ష్మజీవ శాస్త్రానికి అధ్యుడు అని చెప్పుకోదగ్గ లూయీ పాశ్చర్ ఏనాడో చెప్పాడు. అసలు ప్రమాదం బాక్టీరియాతో, వైరస్ తో కాదు, వాటిని అదుపు చేయలేని శరీరానిది అని. 


The seed is nothing, it is the host that is every thing.
 
మన శరీరంలో ఎన్నో కోట్ల బాక్టీరియాలు, వైరస్ లూ ఎప్పుడూ ఉంటాయి. మన శరీరానికి ఉన్న రోగనిరోధక శక్తి వాటిని అదుపులో ఉంచి వాటివల్ల మనకి ప్రమాదం లేకుండా చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అది తగ్గుతుందో ఈ సూక్ష్మజీవులు విజృంభించి రోగాలు కలుగజేస్తాయి.


ఈ ఉదాహరణని సినిమాకి అన్వయిస్తే దర్శకుడిని, వ్యయాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత నిర్మాతదే. ఎందుకంటే ఫైనల్ గా బొక్కపడేది నిర్మాతకే కాబట్టి. ఇప్పుడు ఆరెంజ్ విషయానికొస్తే నాగబాబు స్వయంగా చెప్పాడు సినిమా విడుదలకి ముందే. కథాపరంగా ఈ సినిమా ఆస్ట్రేలియాలో తీసినా అమలాపురంలో తీసినా ఒకటే అని. అలాంటప్పుడు ఆస్ట్రేలియాకి ఎగురుకుంటా పోయి చేతులు కాల్చుకోవడం స్వయంకృతమే అవుతుంది కదా!
  
పది కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా ఇరవై కోట్లు వసూలు చేస్తే హిట్టు కింద లెఖ్ఖ. అదే సినిమాని ముప్పై కోట్లు పెట్టి తీసి ఉంటే అది ఫట్టు అయినట్లు. ఇంత చిన్న వ్యాపార సూత్రం, రోడ్డు పక్కన చిల్లర కొట్టు వాడు కూడా పాటించే సూత్రం మన బడా బడా నిర్మాతలు ఎందుకు విస్మరిస్తారో, తీరా చేతులు కాలాక అప్పుడు ఎందుకు గగ్గోలు పెడుతారో నాలాంటి సామాన్య ప్రేక్షకులకి అర్ధంకాదు.
  
ఇలా అతి చిన్న చిన్న విషయాలనే పట్టించు కోకుండా భేషజాలకి పోయి డబ్బు దుబారా చేసే నిర్మాతలు స్క్రిప్టు పూర్తిగా చదివి, దాని సత్తా ఎంతో అంచనా వేసి దానికి అనుగుణంగా పాత్రధారులని ఎంచుకొని నిర్మాణ వ్యయాన్ని అదుపు చేయగలరని ఆశించడం అత్యాశే అవుతుంది.


కాబట్టి నాగబాబూ, ఇక్కడ take home message ఏమిటంటే వైరస్లనీ, బాక్టిరియాని నిందించే ముందు మన వంట్లో రోగనిరోధక శక్తిని నిర్మించుకోవాలి.

3 comments:

Apparao said...

డబ్బు దుబారా చేసి సినిమా తీస్తే నాకు చాలా చిరాకు
అంత ఖర్చు పెట్టి సినిమా తీయాలా >?
మనం మూడొందలు పెట్టి సినిమా చూడాలా ?

మంచు said...

ఎంటొనండీ మీకొచ్చే సింపిల్ ఐడియాలు కొట్లకు కొట్లు ఖర్చుపెట్టి బొక్కబొర్లా పడే వాళ్ళకి రావు పాపం..:-)

Anonymous said...

well said