నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, December 19, 2010

చంద్రబాబు హరిక్రిష్ణని "మొద్దునాకొడుకు" అన్నాడా?

ఈ రోజు ఎందుకో కాస్సేపు సాక్షి చానల్ చూడాల్సివచ్చింది. ఇటీవల నేను సాక్షి, స్టూడియో-N చానల్స్ చూడడం మానేశాను. అవి రెండూ రెండు వర్గాలకి ప్రైవేటు ప్రాపగాండా చేయడానికే పరిమితమైపోయాయి. చానల్స్ సర్ఫ్ చేస్తూ ఉండగా సాక్షిలో దేవినేని నెహ్రూ ఇంటర్వ్యూ వస్తుంటే కాస్సేపు దాన్ని చూశాను. తను ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉన్న కాలంలో ఒకసారి తన తరువాత పార్టీ పగ్గాలు హరిక్రిష్ణకి ఇస్తానని ఎన్టీఆర్ తనతో చెప్పాడని, ఈ విషయం తాను చంద్రబాబు దగ్గర ప్రస్తావిస్తే, "ఈ మొద్దోడు ఆ మొద్దునాకొడుక్కి అప్పగిస్తాడా? ఇంతకాలం పార్టీని అభివృద్ధి చేసింది ఎవరికో వదిలేయడానికా?" అని అన్నాడని నెహ్రూ చెప్పాడు.
  
హరిక్రిష్ణపైన బాబు అభిప్రాయంలో తప్పేమీ లేదని నాకనిపించినా పెద్దాయన్ని అలా మొద్దోడు అనడం కొంచెం బాధనిపించింది. నెహ్రూ అలా పబ్లిగ్గా చెప్పినదానిలో అబద్ధం ఉంటుందని నేననుకోలేదు. ఈ విషయం తెలిస్తే ఇప్పుడు హరిక్రిష్ణకీ, చంద్రబాబుకీ మధ్య రిలేషన్ లో తేడా వస్తుందని కూడా నేననుకోను. వెన్నుపోటుదారుడు, ఏరు దాటి తెప్ప తగలేసేరకం, తడి గుడ్డతో గొంతులు కోసే బాపతు ఇలా బాబుకి ఎన్ని బిరుదులున్నా ఆయన ప్రత్యర్ధులు కూడా అంగీకరించే క్వాలిటీ ఒకటుంది ఆయనలో. అది ఎదుటి మనిషిని ఆయన చాలా ఖచ్చితంగా అంచనా వేయగలడని. 

2 comments:

Sree said...

ఈ మొద్దోడు ఆ మొద్దుల గురించి మాట్లాడటం విచిత్రంగా ఉంది :)

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Wow!