నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, December 8, 2010

ఎస్సీ వర్గీకరణ సమంజసమే కదా!

మంద కృష్ణ మాదిగ మళ్ళీ టెంటేశాడు నిరాహార దీక్ష అంటూ. ఇలా గతంలో చాలాసార్లు జరిగింది, ఇక ముందు జరగదని గ్యారంటీ లేదు. ఈ MK మాదిగ గారి ప్లాను ఏమైనా, నాకు మాత్రం ఎస్సీలలో మాదిగలకి, మిగతా చిన్నా చితకా ఉపకులాలకీ మాలలు అన్యాయం చేస్తున్నారనిపిస్తుంది. ఉదాహరణకి మీరు ఏ ప్రొఫెషనల్ కాలేజీలో చూసినా ఎస్సీ కేటగిరీలో సీట్లు తెచ్చుకొన్నవారి జాబితా చూస్తే 95% పైగా మాలవారే ఉంటారు.
Devadasi 
ఈ విషయం గురించి ఒక నా కాలేజీరోజుల్లోని ఫ్రెండుతో మాట్లాడుతూ, "అన్నీ మీరే కొట్టేస్తూ ఉంటే వాళ్ళకి(అంటే మాదిగలకి) మిగిలేది మొండిచెయ్యే కదా. వర్గీకరణకి మీరు ఎందుకు ఒఫ్ఫుకోరు?" అనడిగాను. "మేము కష్టపడి సాధిస్తున్నాము. వాళ్ళకి చేతనయితే మాతో సమంగా పోటీ పడి సీట్లూ,ఉద్యోగాలూ తెచ్చుకోవాలి" అన్నాడు. "భలే మాట చెప్పావురా! కాబట్టి రిజర్వేషన్లు పూర్తిగా ఎత్తేసి, ఎవరైతే కష్టపడతారో అన్ని సీట్లు, ఉద్యోగాలూ వాళ్ళకే ఇవ్వాలి. ఇదేనా నువ్వు చెప్పేది" అన్నాను. "మనువాదివనిపించుకున్నావురా! నీలాంటి వాళ్ళుంటారనే బాలాసాహెబ్(అంటే అంబేద్కర్) మాలా అణగారిన వర్గాలకోసం రిజర్వేషన్లు పెట్టాడు" అన్నాడు వాడు.
 
అణగారిన వర్గాలకోసం రిజర్వేషన్లు అయినప్పుడు, ఆ అణగారిన వర్గాలలో, మరీ ఎక్కువగా అణగారిన వారికోసం రిజర్వేషన్లలో, రిజర్వేషన్ పెట్టడమనేది సమంజసమే కదా!

6 comments:

Praveen Sarma said...

వీళ్లు ఏ రకంగా అంబేద్కర్ వారసులు అవుతారు? వీళ్ల దృష్టిలో అగ్రకులంవాళ్లు మాత్రమే దళితులని దోచుకుంటే తప్పు కానీ దళితులలోని డబ్బున్నవాళ్లు పేద దళితులని దోచుకుంటే తప్పు కాదట! ఏమి దళితాభ్యుదయవాదం ఇది?

Kathi Mahesh Kumar said...

సంఖ్యాపరంగా ఎక్కువున్న మాదిగలు అవకాశాల పరంగా మాత్రం మాలల వెనకపడటానికి కొన్ని ప్రత్యేకపరిస్థితులు ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నాయి. వాటిని కూలంకషంగా వివరించాలంటే ఒక పుస్తకమే అవుతుంది. మాదిగలు వర్గీకరణ కోరుకుంటున్నది ఆ అవకాశాల్లోని అసమానతల్ని తగ్గించే ఫ్రేంవర్క్ కోసం. సహజంగానే (కొందరు) మాలలు వ్యతిరేకించడం అర్థం చేసుకోతగ్గ పరిణామమే. ఎందుకంటే ఇప్పటివరకూ వస్తున్న advantage ని వదులు కోవడం అంత సులభం కాదు. కానీ మాల నాయకులు గ్రహించాల్సింది ఏమిటంటే న్యాయం కోసం అగ్రకులాలతో పోరాడుతున్న మనం, మనలోని సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా పనిచేస్తే, మనలో సైద్ధాంతిక నిబద్ధత ఎక్కడున్నట్లు? If we can't do justice to likes of us, how do we seek justice from people who care a damn for us?

Praveen Sarma said...

మేము తూర్పు గొదావరి జిల్లాలో ఉండే రోజుల్లో నాకు కొంత మంది మాల కులస్తులు పరిచయం అయ్యారు. వాళ్లందరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు. మాదిగ కులస్తుడు ఒక్కడైనా పరిచయం అవ్వలేదు. తాటిపాక అనే గ్రామంలో బుడగ జంగాలు (బుడగ వాయించుకుంటూ పాటలు పాడుతూ భిక్షం అడిగేవాళ్లు) ఉండే వీధికి వెళ్లాను. వాళ్లందరూ గుడిసెలలోనే ఉంటున్నారు. ఒక్క కుటుంబానికైనా సిమెంట్ ఇల్లు లేదు. మాలలేమో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ బాగా సంపాదించి బంగ్లాలు కట్టుకోవచ్చు. మాదిగలు, బుడగ జంగాలు మాత్రం అంటరానివాళ్లలా ఊరి చివర గుడిసెలు వేసుకుని ఉండాలి. మాల మహానాడు దృష్టిలో దళితవాదం అంటే ఇది. నేను మాదిగని కాదు, బుడగ జంగంవాడిని కాదు. దళిత అభ్యుదయవాదిగా నేను మాదిగల పక్షానే ఉంటాను.

Anonymous said...

praveen your great. bhale sutiga prasnistavu. induke i like U.
praveen maadigalapi maalala aadipatyam gurinchi oka katha ni kalam nundi ravali.

Anonymous said...

ఏ సమానత్వమైనా పై నుండి రావాలి కిందనుండి ప్రారంభిస్తాం అంటే అది కుదరని పని . ఆ వర్గీకరణేదో పై నుండి (అగ్రకులాలనుండి) మొదలు పెడదామా ? ఇన్ని చెప్పేటోళ్ళు తెలంగాణ విషయంలో ఎందుకు వెనకడుగువేస్తున్నారు ? సీమాంద్రనాయకులకు తెలంగాణ వెనుకబాటు కనిపించడంలేదా ? మాలలు రాజ్యాలు ఏలేస్తున్నారా ? ఆంధ్రులు మాత్రం కలిసుండాలా? దళితులు విడిపోవాలా? భలే ఉంది మీ సాంఘిక న్యాయం . ఆంధ్రప్రదేస్‌ను విడగొడితే ఆటోమేటిక్‌గా వర్గీకరణ సమస్య తీరిపోతుంది ? చేద్దామా ?

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

OK.Let's do it boss.