మీరు సెక్స్‌లో ఎందుకు పాల్గొంటారు? ఏంట్రా ఈ తిక్క ప్రశ్న అని చూడకండి. మామూలుగా సెక్స్ అనేది కొద్ది నిముషాల ఆరాటం, పోరాటం, తరువాత క్లైమాక్స్. వళ్లంతా అలసిపోయి ఒక అందమైన అనుభూతిని మిగిల్చడం... కానీ సెక్స్ అంటే కేవలం క్లైమాక్స్, ఆనందం, పరవశం, అనిర్వచనీయ భావం ఇంతే కాదు. సెక్స్ అంటే ఆరోగ్యం కూడా. వంటికి మంచి ఎక్సర్‌సైజ్ కాబట్టి దాని వల్ల వచ్చే ఆరోగ్యమే కాకుండా, సెక్స్ వల్ల అనేక ఉపయోగాలున్నాయి.
సెక్స్ వల్ల మన వంట్లో endorphins అనే కెమికల్స్ విడుదలవుతాయి. ఇవి తలనొప్పిని తగ్గించడానికి, రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి తోడ్పడుతాయి. పార్శ్వపు తలనొప్పి(migrain)ని ఇవి చాలా బాగా తగ్గిస్తాయి. కాబట్టి మీ పార్ట్‌నర్ ఎప్పుడైనా అబ్బ, తలనొప్పిగా ఉంది అన్నప్పుడు మీరు అటు తిరిగి పడుకోకుండా ఆమెని/అతడిని శృంగారానికి ప్రేరేపిస్తే ఆ తలనొప్పి తగ్గిపోతుంది.
అలాగే climax/orgasm దశలో వంట్లోని కార్టిసోల్ అనే హార్మోన్ కూడా అనేక రెట్లు ఎక్కువవుతుంది. దీని వల్ల వళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఇది వత్తిడిని, చీకాకునూ బాగా తగ్గిస్తుంది.
Multiple sclerosis అని ఒక సుత్తి జబ్బు ఉంది. దీని బారిన పడ్డ వాళ్ళు అనేక రకాల బాధలు అనుభవిస్తారు. సరిగ్గా నడవలేకపోవడం, ఊరికే అలసి పోవడం, కొన్ని సార్లు వీల్‌చైర్‌కి పరిమితం అవడం ఇలా నానా రకాల బాధలుంటాయి. ఈ వ్యాధికి ఇప్పటి వరకూ మందు లేదు. దీనివలన కలిగే మరొక సమస్య erectile dysfunction. వయాగ్రా లాంటి మందులు వాడి, అంగ స్థంభన కలిగించి సెక్స్ చేసినప్పుడు ఈ వ్యాధి లక్షణాలు తగ్గినట్లనిపిస్తుందని ఈ జబ్బుతో బాధపడే ఒక పేషంటు అనుభవం ఇక్కడ చూడండి.
http://www.healthcentral.com/multiple-sclerosis/c/557688/115510/sex
కాబట్టి సెక్స్ అనేది కేవలం ఆనందమే కాదు, ఆరోగ్యం కూడా.
No comments:
Post a Comment