నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, December 22, 2010

మరుగు దొడ్లు లేనందువల్ల భారతదేశంలో ఏటా 30 లక్షల కోట్ల పైగా నష్టం. అయినా దేశంలో టయిలెట్ ఉన్నవాళ్ళ కన్నా సెల్ ఫోన్ ఉన్నవాళ్ళే ఎక్కువ.

ప్రపంచ బ్యాంకు గత వారం విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో మరుగు దొడ్లు అందరికీ అందుబాటులో లేనందువల్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రతి యేటా సుమారు 54 బిలియన్ అమెరికన్ డాలర్ల నష్టం సంభవిస్తూందని అంచనా వేసింది. ఇది ప్రస్తుత మారకం రేట్లతో చూస్తే ఇంచుమించు 30 లక్షల కోట్ల రూపాయల పైచిలుకే!! బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన వల్ల కలిగే వ్యాధులనుండి వైద్యం చేయించుకోవడానికి పెట్టే ఖర్చు, జబ్బు పడ్డందువల్ల పనులకు హాజరు కాకుండా కలిగే నష్టం, స్కూళ్ళలో టాయిలెట్లు లేనందువల్ల చాలా మంది అమ్మాయిలు చదువుకి ఫుల్‌స్టాప్ పెట్టినందువల్ల పరోక్షంగా కలిగే నష్టం, దేశంలో సరయినా శుభ్రత లేనందువల్ల విదేశీ టూరిస్టులు భారత దేశాన్ని సందర్శించక పోవడంవల్ల కలిగే నష్టం ... ఇలా అన్ని కలిపి లెక్క కట్టి ప్రపంచ బ్యాంకు ఈ నిర్ధారణకి వచ్చింది,


పల్లెటూర్లలోనే కాకుండా పట్టణాలలోని మురికి వాడల్లో కూడా బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చాలా సాధారణ విషయం.దానివల్ల నీరు కలుషితమయ్యి ఆ నీటినే తగడం వల్ల డయేరియా లాంటి అంటురోగాలు ప్రబలడం ఒక్కోసారి ఇవి ప్రాణాంతకం కావడం జరుగుతూ ఉంటుంది. ఒక United Nations నివేదిక ప్రకారం మన దేశంలో 36 కోట్ల మందికే మరుగు దొడ్డి సౌకర్యం అందుబాటులో ఉంది. ఇందులో అధిక భాగం ఉమ్మడి టయిలెట్లు. కుటుంబానికి స్వంత టాయిలెట్లు లెక్కేస్తే ఈ సంఖ్య ఇంకా తక్కువగా ఉంటుంది. 
 
1999 లో భారత ప్రభుత్వం Total Sanitation Campaign అన్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని లక్ష్యం ఏమిటంటే 2010 కల్లా బహిరంగ మల విసర్జన లేకుండా చేయడం. 2010 మరికొన్ని  రోజుల్లో వెళ్ళిపోతుంది. కానీ ఈ పధకం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
 
సరే మనది బాగా వెనక పడ్డ దేశం అనుకోవడానికి లేదు. మరొక నివేదిక ప్రకారం మన దేశంలో 56 కోట్లమందికి పైగా సెల్ ఫోన్ కనెక్షన్లు ఉన్నాయి. అంటే టాయిలెట్ అందుబాటులో లేని వాళ్ళకు ఎంతో మందికి సెల్ ఫోన్ ఉంది అన్న మాట. ఇలా ఎందుకూ అని ఆలోచిస్తే, సెల్ ఫోన్‌లు అమ్మేవాళ్ళు వాటి గురించి అదే పనిగా ఊదరగొట్టేస్తారు. సెల్ లేని బతుకూ ఒక బతుకేనా అని అనిపించి జనం వాటిని కొనేలా చేస్తారు. వాళ్ళ చేత కొనిపిస్తారు. ఒరేయ్ వెధవా, సెల్ ఫోన్ లేకపోతే పోయింది. ఇంట్లో ఒక మరుగు దొడ్డి కట్టుకోరా అని చెప్పేవాళ్ళు లేరు. అందుకే ఇలా. 

6 comments:

Anonymous said...

సెల్ అంటే 500రూపాయలకే దొరుకుతుంది కానీ tailets అలా కాదు కదా.చాలా ఖర్చు పెట్టాలి.కరెక్టే కదా!

Anonymous said...

పాయిఖానాలు లేకపోవడమేమిటి, పర్ణశాల గ్రూప్ వారి పాయిఖానాలు బ్లాగుల్లో పరిమళాని వెదజల్లుతూనే వున్నాయి.

astrojoyd said...

so to fill this 30lks loss,the govt is inviting tenders [to construct them]from health-minster nd cm's kith nd kins.

tarakam said...

దేశంలో ఉన్న ప్రజలందరికీ ఈ సౌకర్యం అందేదాకా అందరు రాజకీయనాయకుల చేతా బలవంతంగా ఆమరణ నిరాహారదీక్షలు చేయించితేగాని ఈ సమస్యకు పరిష్కారం దొరకదేమో!

Sree said...

నిరాహార దీక్షలెందుకండీ దండగ. అందరం సుష్టుగా పప్పులు తిని MLA క్వార్టర్స్ ముందు పొద్దున్నే బహిరంగ విసర్జన చేస్తే సరి. దెబ్బకు దిగి వస్తారు :)

Sree said...

నాకు ఓ మాంచి పేరడీ పాట గుర్తుస్కొస్తోంది ( తెలుగు వీర లేవరా స్టైల్ లో).

తెల్లవారు లేవరా..అ అ అ ఆ ఆ.. అ అ అ ఆ ఆ..
తెల్లవారు లేవరా చెంబు పట్టుకెల్లరా..
చెట్టు కింద కూర్చుని దడా దడా వేయరా.
కుక్క వచ్చె ట ట ట టాన్.. పంది వచ్చె ట ట ట టాన్..
కుక్క వచ్చె పంది వచ్చె, అదరవద్దు బెదరవద్దు నీ పని చేయరా.

no offences please, just for fun