నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Saturday, December 11, 2010

కేవీపీ నోరు విప్పితే సునామీ!

జగన్ తన మాస్టర్ ప్లాన్ కొద్ది కొద్దిగా అమలులోకి తెస్తున్నాడు. మాటకొస్తే తన మీద అవినీతి ఆరోపణలూ, వేల లక్షల కోట్ల లెక్కలు బయటకి తీస్తున్న ప్రత్యర్ధుల నోళ్ళు మూయించాలని ఆ కోట్లని కేవీపీ ఖాతాలో జమ చేయడానికి ఒక ఎత్తుగడ వేశాడు. అందులో భాగమే కొండా సురేఖ కేవీపీకి రాసిన లేఖ. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన అవినీతి అంతా కేవీపీ చేసినదే అనీ, అలా దోపిడీ అయినా లక్షల కోట్ల ప్రజా ధనం అంతా సదరు కేవీపీ ఖాతాలోనే జమ అయిందనీ ఒక లేఖాస్త్రం సంధించి దాన్ని సురేఖ అనే విల్లునుంచి వదిలాడు జగన్. మరీ ఒక్కడే అంత భోంచేశాడు అంటే అంత నమ్మబుల్ గా ఉండదని జలయగ్నం పేరిట తిన్నదానిలో పొన్నాల లక్ష్మయ్యకి కూడా కొంత భాగం పంచాడు. 

ఈ దెబ్బతో మూడు నాలుగు పిట్టలు పడగొట్టాలని జగన్ వ్యూహం. అవినీతి జరిగింది అని అంగీకరించడం ఒకటి. అయితే ఆ బురద తనకి, తన తండ్రికీ అంటకుండా కేవీపీకి అంటించేయడం. అసలే అందరూ ఇప్పుడు కేవీపీపైన గుర్రుగా ఉన్నారు. ఎవరూ పబ్లిగ్గా అతనికి సపోర్టు వచ్చే అవకాశాల్లేవు. వైఎస్ మరణానంతరం జరిగిన సంతకాల సేకరణతో తనకి సంబంధం లేదని పక్కకి నెట్టేయడం మరొకటి. "నీ తండ్రి చనిపోయి ఆ శవం కూడా కాలకముందే ఎమ్మెల్యేల సంతకాలు సేకరించిన నీకు మానవత్వం గురించి మాట్లాడే హక్కుందా?" అని తులసిరెడ్డి చేసిన హుంకారానికి ఇదే జగన్ సమాధానం. 
 
వైఎస్ మరణానంతరం కేవీపీ అధిష్టానానికి విధేయుడై తనకి చెయ్యిచ్చాడని కూడా జగన్ బాబుకి లోలోపల అతని మీద మంటగా ఉంది. ఇలా కేవీపీ పైన విసిరిన ఒక లేఖాస్త్రం బహుళార్ధ సాధకంగా ఉంటుందని జగన్ భావించి ఉండవచ్చు.


అయితే, కేవీపీ రామచంద్రరావు అనే వాడు తన కుటుంబం వెలుపల ఒక్క ఓటు కూడా తెచ్చుకోలేని చవట, చచ్చు సన్నాసి, దద్దమ్మ  అయ్యుండవచ్చు కానీ, నక్క జిత్తులలో, ఎత్తులూ, పైఎత్తులు వేయడంలో, వంగి వంగి అదను చూసి చావు దెబ్బలు, దొంగ దెబ్బలు తీయడంలో ఆరితేరి పీహెచ్ డీ సాధించిన వ్యక్తి. ఏదో ప్రాణమిత్రుడి కొడుకు, ప్లాట్ ఫారం స్థాయినుండి తనని ఎంపీని చేసిన మనిషి కొడుకు అని జగన్ రెడ్డిని ఉపేక్షించినంత కాలమే! అలా కాక ఓపిక నశించి అలుగుటయే ఎరుంగని అజాత శత్రుడే అలిగిననాడు అని కేవీపీ అనే గుంటనక్క తన అస్త్ర శస్త్రాలను బయటకి తీసి సంధిస్తే జగన్ బండారం మొత్తం బ్యాంకు ఖాతాలతో, నోట్ల కట్టల సీరియల్ నంబర్లతో సహా న్యూస్ పేపర్లలో, టీవీ చానళ్ళలో ప్రత్యక్షమౌతుంది. 
 
ఆఫ్ కోర్స్, ఆ సమయానికి కెవీపీ ఎక్కడో కాకులు దూరని కారడవిలోనో, చీమలు దూరని చిట్టడవిలోనో దూరుకొని ఉంటే తప్ప ప్రాణాలతో ఉండలేడనుకోండి.అది వేరే విషయం.

3 comments:

పండు said...

అన్నా,
మనలాంటి టుమ్రీగాళ్ళకొచ్చిన ఈ చిన్నచిన్న దౌట్లు జగన్ కి రావంటావా? వూర్కే బుర్రలో ఆలోచనరాంగానే, సురెఖక్కా, లేఖరాశెయ్ అని చెప్తాడా? కాంగ్రెస్ లో వుండి నువ్వు పైకెట్లొస్తావొ నేనుజూస్తా అనుకునేవరకు వెళ్ళాకనే బయటికొచ్చినాడు.ఎన్న్నోలెక్కలు వేస్తేగాని ఒక్కోపనిజెయ్యరు.

astrojoyd said...

kvp,ki antha seen ledandee...

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఒక్కోసారి భయమ్కరమైన్ మేధావులు కూడా చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. చరిత్రలో కోకొల్లలుగా ఉదాహరణలున్నాయి.