నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, December 26, 2010

నాగవల్లి: చూసినవాళ్ళు ఎవరైనా మటాషే!

నాగవల్లి ఇచ్చిన షాక్ నుండి ఇప్పుడే తేరుకొని ఈ పోస్టు రాస్తున్నాను. సహ బ్లాగరుల రాతలను బట్టి, నిన్న సాక్షి ఛానల్ ఫోన్‌ఇన్‌లో వెంకటేష్ స్వయంగా పాల్గొనడం చూసి ఇది ఎత్తిపోతల సినిమా అని తెలిసి(దీని మీద ఈ పొద్దున్నే ఒక పోస్టు రాశాను కూడా) కూడా వెళ్ళినందుకు తప్పంతా నా పైనే ఉంది. అది కాదనడం లేదు. చేసుకొన్న వాడికి చేసుకున్నంత మహాదేవా అన్నారు కదా పెద్దలు. కాబట్టి నాది స్వయంకృతాపరాధమే అని ఒప్పుకుంటూ ఈ పోస్టు రాయడానికి ఒక కారణం ఉంది. ఈ సినిమా ఎంత డేంజరస్సో పూర్తిగా రివ్యూలలో ఎవరూ రాయలేదని భావించి ఆ దిశగా ఈ ప్రయత్నం. 

 


అస్సలు ఈ సినిమా చంద్రముఖికి సీక్వెల్ కాదు. అదే సినిమాని యాక్టర్లని మార్చి, పాత్రల పేర్లు కొద్దిగా మార్చి, జమిందారు చేసే వింత శబ్ధాన్ని లక లక బదులు ఔరా ఔరా అని పెట్టి తీసిన మరో సినిమా. 


*ఒక ఇంట్లో అతీత శక్తుల వలన ఇబ్బందులు కలుగుతాయి. వాటిని ఎదుర్కోవడానికి ఒక సిద్ధాంతి, ఒక సైకియాట్రిస్టూ చేతులు కలుపుతారు. ఒకాయన అమ్మాయి వంట్లో నుండి ఆత్మని బయటకి తెస్తే, ఇంకొకాయన దాన్ని ఇంట్లో నుండి బయటకు పంపుతాడు. నాగవల్లిలో ఇది కొద్దిగా మారింది. అంతే.
*సైకియాట్రిస్టు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ లైనేస్తున్నట్టు అనుమానించే ఒక కమేడియన్ పాత్ర రెంటిలో ఉంది. ఒక దానిలో వడివేలు, మరొక దానిలొ ధర్మవరపు. 
*ఆత్మ ఆవహించిన పాత్రలో ఆ ఆత్మ ప్రస్తావన వచ్చినప్పుడు గొంతు పెరగడం(సైకిక్ వైబ్రేషన్స్ అని చెప్తారు సినిమాలో) దాని ఆధారంగా డాక్టరు డయాగ్నైజ్ చేయటం. ఇదీ కామనే రెంటిలో.
* ఇక పాటలు కూడా.చంద్రముఖిలో మొదటి పాట స్టయిల్లోనే ఇందులో కూడా హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది. దాన్ని బట్టి మనకేమి అనిపిస్తుందంటే వాసు రజనీ కాంత్ కోసం తయారు చేసుకున్న స్క్రిప్టుని ఏమాత్రం మార్చకుండా వెంకటేష్‌తో లాగించేశాడు అని. మరొకటి చంద్రముఖిలో గాలిపటాల పాట ఉంటే నాగవల్లిలో కబడ్డీ పాట ఉంది.


చంద్రముఖిలో లేనివి నాగవల్లిలో ఉండేవి అనేక అవలక్షణాలున్నాయి. వాటిని కూడా చెప్పుకుందాం. 
*ప్రధానంగా రిచా గంగోపాధ్యాయని జ్యోతిక వేసిన పాత్ర కోసం తీసుకోవడం. పిల్ల వాడి భుజాలపైన కొండని పెట్టి మోయమన్నట్లు ఉంది అది. అప్పటికీ కొంతయినా కవర్ చేద్దామని కళ్లకి ఎర్ర కాంటాక్ట్ లెన్సులు పెట్టి ట్రై చేసినా ఆమె పూర్తిగా తేలి పోయింది. అది ఆమె తప్పు కాదు. అంత సీన్ ఆమెకి లేదంతే!
ఇక క్లైమాక్సులో డాన్స్ కోసం రిచా స్థానంలో అనుష్కనే తీసుకొచ్చి డాన్స్ చేయింఛాడు వాసు ఆమె అయితే కొంతయినా లాక్కు రాగలదన్న ఆశతో.
  
*నాగవల్లి ప్రియుడు గుణశేఖరుడు పాత్రలో నటించిన అబ్బాయి అనుష్కకి చిన్న తమ్ముడిలాగా ఉన్నాడు. అనుష్క అతనితో కలిసి రొమాన్సు చేసే పాటలో టీచర్ ముందు భయం భయంగా చేతులు కట్టుకొని నించున్న పిల్లవాడిలాగే అనిపించాడు. అనుష్క పక్కన మహేష్ బాబు(ఖలేజాలో) కూడా పిల్లవాడిలాగే అనిపించినప్పుడు అనుష్క భుజాల ఎత్తున్న వాడిని ఆమెకి ప్రియుడిగా సెలెక్ట్ చేయడమేమిటో!
*అన్నింటినీ మించిన మైనస్ 130 యేళ్ళ వయసున్న రాజు పాత్రధారిగా వెంకటేష్ కామెడీ యాక్టర్‌లా అనిపించడం. గోళ్ళు, జడలూ పెంచుకొని వింత వింత శబ్దాలు(విలన్/రావణ్‌లో వీరయ్య పాత్రధారిలాగా) చేస్తూ, పిచ్చి కూతలు కూస్తూ, హాంగ్‌కాంగ్ కుంగ్‌ఫూ సినిమాలలో లాగా గాల్లోకి ఎగిరి ఫైటింగ్ చేయడం. జిమ్ కేరీ సినిమా మాస్క్‌లో లాగా కంటికి కనిపించనంత వేగంగా కదులుతూ పిల్లలు పడి, పడీ  నవ్వుకొనేలాగా ఫైటింగ్ చేయడం.... ఇదంతా నవ్వులాట అయిపోయింది.  

అస్సలు చివరి ముప్పయి నిముషాల సినిమా భయం కలిగించడానికి ప్రయత్నం చేసి, కామెడీగా తయారయ్యి ప్రేక్షకులకి హింసాత్మకంగా అనిపిస్తుంది.

ముక్తాయింపు: సెకండ్ హాఫ్‌లో సిద్ధాంతి పాత్ర డాక్టరుతో అంటాడు: నువ్వు గాయత్రిని కాపాడావు. నేను గౌరిని కాపాడుతాను అని. అప్పుడు ప్రేక్షకులకి ఒకటి అనిపిస్తుంది. సరే బాస్, ఆయన దాన్ని, నువ్వు దీన్ని కాపాడుతారు సరే. మమ్మల్ని ఎవరు కాపాడుతారు అని. దానికి సమాధానమేమిటంటే, మనల్ని మనమే కాపాడుకోవాలి ఆ స్టేజిలో లేచి థియేటర్‌లోంచి వచ్చేయడం ద్వారా.

10 comments:

XxXxX said...

next movie nagaballi lo brahmi hero.. endukante rajni assistant venky indulo hero ayyadu.. alage venky assistant brahmi next nagaballi lo hero autadu.. mari heroin evaru chepmaa??

వేణూ శ్రీకాంత్ said...

హ హ ముక్తాయింపు బాగుంది :-)

శరత్ 'కాలమ్' said...

:))

ANALYSIS//అనాలిసిస్ said...

నాగబల్లిలో హీరోయిన్ కోవైసరళ అయితే ఆ పాత్రకు న్యాయం చేసినట్టుంటుంది ... మనందరం పి.వాసుకి రికమెండ్ చేద్దాం. సిద్దాంతి పాత్రకి వేణుమాధవ్ గానీ సునీల్ గానీ ఆలీ గానీ న్యాయం చేస్తారని నాభావన. కొండవలస అయితే మరీబెటర్ . సినిమా ప్రమోషన్ అవసరం ఉండదు

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Super, ANALYSIS.

Indian Minerva said...

మీరు మరీ ఇంతగా ఆడిపోసుకుంటున్నారుగానీ దీని కన్నడమాతృకకూడా ఇలాగే తగలడింది. మనవాళ్ళుచేసిందల్లా దాన్నలాగే కల్తీచేయకుండా దించెయ్యడం. ఈ సినిమా వెంకటేషుది కాబట్టి చూడ మూడు రావట్లేదుకానీ అదే బాలయ్యబాబు తీసుంటే ఈపాటికి నాకు మూడుండేది :)

mirchbajji said...

kannada lo vishnuvardhan last picture kaabatti saanubhoothi tho hit ayindemo... aa konam lo think cheyadam maani, kannada lo hit ayindani telugu lo theesthe ilaage untundi.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

I agree with mirchbajji.

Anonymous said...

ఫన్ టాస్టిక్. venky wrong choice.
బాలయ్య పరమ వీర చెత్త sorry చక్ర ఎలా ఉండబోతుందో

Anonymous said...

venky is ok but heroiens i con't bare that all girls.