జగన్ లాగా, బాబు లాగా వందల వేల సంఖ్యలో జన సమీకరణ చేసే సీన్ నాకు లేదు కాబట్టి ఇందు మూలముగా మీ అందరికీ విన్నవించుకోవడం ఏమనగా... బ్లాగ్ లోకం తరఫున మనందరం "నిరంతర పరిమిత నిరాహార" దీక్ష చేద్దాం. ఏమిట్రా వీడు దీక్ష పేరే ఇంత self- controdictary గా పెట్టాడు అనుకోవద్దు. Let me explain. ఇది జగన్ దీక్ష లాగా 48 గంటలో 96 గంటలో అని పరిమిత కాలం చేసే దీక్ష కాదు. రైతుల సమస్యలు ఆసాంతం తీరే దాకా కొనసాగుతుంది. అలా అని దీక్ష రోజంతా ఉండదు. రోజులో కొంతభాగం మాత్రమే దీక్షా కాలం. అంటే ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల దాకా, లేదంటే సాయంత్రం 5 నుండి 9 గంటల దాకా, లేదా దీక్షాకారుల సౌలభ్యాన్ని బట్టి రోజులో ఏ మూడో నాలుగో గంటలు చేస్తే చాలు.
అలాగే అందరూ ఒక చోట స్టేజి కట్టుకొని, కింద చాపలు పరుచుకొని చేయాల్సిన పని లేదు. ఎవరెవరి ఇళ్ళలోనో, ఆఫీసుల్లోనో, ఎక్కడ పని చేస్తుంటే అక్కడ దీక్ష చేబడితే చాలు. మధ్యలో కాఫీ, స్నాక్స్ కోసం బ్రేక్ తీసుకోవచ్చు. జగన్‌కి సాక్షి లాగా మనకి నెట్ ప్రపంచం ప్రొపగాండా కోసం పనికొస్తుంది.
5 comments:
అయితే వాకే .నేన్ రెడీ
చంద్రబాబు దీక్షను చిరంజీవి ఏమీ అనకూడదు. మీరు మాత్రం వెటకారం చేయవచ్చా ?
ఈరొజు మన రాస్ట్రం లొ దమ్మున్న ఎకైక మాగాడు జగన్ .
If it is KCR-MARK r STYLE deekshaa means,iam eveready[night veg biryani+pomogrenet juice+fruit salad wth lime-tea
ఎవరినీ వెటకారం చేయడం కాదండీ. నా స్టైల్ దీక్ష ఇలా ఉంటుంది అని అంతే. అయినా అస్సలు ఏమీ తీసుకోకుండా దీక్ష అని ఎవరినైనా పిలిస్తే ఎలా చెప్పండి.
Post a Comment