నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, December 1, 2010

ఎంకీస్ మ్యారేజ్ సుబ్బీస్ డెత్ లాగా ప్రజారాజ్యం పరిస్థితి

శంకర్ దాదా ఎంబీబిఎస్ సినిమాలో చిరంజీవి తెలుగు సామెతలని మక్కీకి మక్కీ ఇంగ్లీషులోకి అనువదించి ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చింది అనే సామెతని ఇలా దించుతాడు. ఇప్పుడు చిరంజీవి పార్టీ అదే పరిస్థితి ఎదుర్కొంటూంది. కాంగ్రెస్ జగన్ మధ్య రగిలిన చిచ్చు తనకి లాభిస్తుందని చిరంజీవి ఆయన సహచరులు భావిస్తూ వచ్చారు. అది నిజమన్నట్లుగానే సోనియా చిరుని ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించి మాట్లాడి అవసరమైనప్పుడు మద్ధతు ఇచ్చేలా సెట్ చేసింది. తరువాత సీఎం అభ్యర్ధి కిరణ్ పీఆర్ పీ కూడా కేబినెట్ లో ఉంటుందని చెప్పాడు.
 
అక్కడ తిరిగింది కథ మలుపు. అప్పటికే జగన్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేయాలని డిసైడై పోయాడు. వెనువెంటనే కర్ణాటకలో గాలి సోదరులు రంగంలోకి దిగారు. ప్రజారాజ్యం పార్టీని చీల్చడానికి శరవేగంగా పావులు కదిపారు. నిముషాలలో ఎనిమిది మంది పీఆర్పీ ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపి వాళ్ళని లైన్లో పెట్టారు. 
 
పార్టీ ఫిరాయింపు చట్టం బారిన పడకుండా ఉండాలంటే పీఆర్పీలోంచి ఆరుమంది బయటకొస్తె చాలు. అంతెకాకుండా అదికారంలో ఉన్న కాంగ్రెస్నుండి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం కన్నా తాడూ బొంగరంలేని పీఆర్పీని చీల్చడం చాలా సులువని గ్రహించి గాలి అండ్ కో చిరు పార్టీకి కన్నం వేయాలని చూశారు.  పైపెచ్చు పీఆర్పీలో ఉన్న వాళ్ళు ఒక ఐడియాలజీ తొక్కా తోలు లాంటివి చూసి వచ్చిన వాళ్ళు కాదు. ఏదో చిరంజీవి పొడిచేయకపోతాడా అధికారంలోకి రాకపోతామా అని అల్లు అరవింద్ కి కోట్లు కట్టి టిక్కెట్లు తెచ్చుకొని, మరిన్ని కోట్లు ఖర్చుపెట్టి గెలిచి ఆ కోట్లు ఎలా రాబట్టుకోవాలో తెలియక తికమక మకతికలో ఉన్నారాయె.

ఈ జంప్ జిలానీలని కోఆర్డినేట్ చేస్తున్నదీ, గాలి బ్రదర్స్ తో టచ్ లో ఉన్నది పీఆర్పీ నాయకుడు మహేశ్వర రెడ్డి. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ఆఫర్ చెసిన మూడు కేబినెట్ బెర్తులని తీసుకొంటే అవి ఎవరికి దక్కితే మిగిలిన వారు జెండా ఎత్తేస్తారేమోనని భయపడి చిరు ఆ ప్రతిపాదనకి నో చెప్పాడని ఒక సమాచారం.

ఏది ఏమైనా రాబోయేది చిరంజీవికి గడ్డుకాలం. తన వాళ్ళని వేయికళ్ళతో చూసుకోవల్సిన అవసరం చిరుది. ఇప్పటికే ఆళ్ళగడ్డ భూమా ఫ్యామిలీ తట్టాబుట్టా సర్దుకొని రెడీగా ఉన్నదాయే! మిగతా వాళ్ళు కూడా గోడలు దూకకుండా కాపలా కాయాల్సిన భాధ్యత చిరు భుజాల మీద ఉంది. 

చిరంజీవి గారూ మీరు అరవింద్ మీద కూడా ఓ కన్నేసి ఉంచండి. గాలి వారు మంచి ఆఫర్ ఇస్తే అరవిందే గుంపగుత్తంగా మీకు తెలియకుండా మీ ఎమ్మెల్యేలందర్నీ హోల్ సేల్ గా అమ్మినా అమ్మేస్తాడు. జాగ్రత్త! 

2 comments:

Apparao said...

కొత్త సినిమా రావాలి
నిర్మాత : గాలి & జగన్
దర్శకత్వం : అప్పారావు శాస్త్రి
హీరో : జగన్
సపోర్టింగ్ హీరో : చిరు
కామెడియన్స్ : డిసెంబర్ 1 న చెప్తాం ( మంత్రి పదవి రానోళ్ళు)
ప్రేక్షకులు : వోటేసిన వాళ్ళు


ఇదే కామెంట్ చాకిరేవులో కూడా పెట్టా :)
ఇంకా ఆమోదించలేదు (అనుగ్రహించలేదు)
రాజ్యం వోళ్ళని కొనటం చాలా ఈజీ

The One said...

hehe,,bagundi,,