నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, December 3, 2010

మంత్రులు శాఖలకోసం పట్టుబట్టకుండా. మంత్రి పదవి రాని వాళ్ళు అలగకుండా సర్దుకుపోయేలా చెయవచ్చు ఇలా!!

కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం ఇలా ప్రమాణ స్వీకారం చేసిందో లేదో అలా అలుగులు,లుకలుకలూ మొదలయ్యాయి. ఎవరైతే తమకు అంతగా ప్రాధాన్యం లెని శాఖ ఇచ్చారు అనుకున్నారో వారందరూ కలిసి గూడుపుఠాణి మొదలు పెట్టారు. ఇది మనరాష్ట్రానికో, కిరణ్ రెడ్డికో పరిమితమయిన సమస్య కాదు. అన్ని రాష్ట్రాల్లో, అన్ని పార్టీలకూ ఎదురయ్యే సమస్య. ప్రభుత్వమూ, ముఖ్యమంత్రీ బలంగా ఉన్నచోట్ల తక్కువగా ఉంటుంది లేకపోతే ఎక్కువగా ఉంటుంది. ఇంత తీవ్రమైన ఈ సమస్యని అతి తేలిగ్గా పరిష్కరించుకోవచ్చని తలలు పండి, ఎండిన ఈ రాజకీయులకి, పరిపాలనా నిపుణులకీ ఎందుకు తోచదో నాకర్ధం కావడం లేదు.
   
ఈ బర్నింగ్ ప్రాబ్లమ్ కి అతి సులువైన పరిష్కారం నేను చెప్తాను చూడండి. ముందుగా, వీళ్ళ అలుగు దేనికో గమనించాలి. కొన్ని శాఖల్లో అధికారము, మందీ మార్బలమూ, డబ్బూ తక్కువగా వస్తాయనే వీళ్ళు అయా శాఖలని తక్కువగా చూస్తారు. ముందుగా అన్ని శాఖల్లోని మంత్రులకీ ఒకే రకమైన హంగూ ఆర్భాటం ఉండాలి. ఒకే సంఖ్యలో, ఒకే రకమైన కాన్వాయ్, అందులోని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉండాలి. ఇక కార్యాలయం సైజూ, అందులో ఉద్యోగులూ,సేవకులూ ఇలా పటాటోపం కూడా అందరికీ సమంగా ఉండాలి. 
  
ఒరేయ్ నాయనా, అసలు ఏడుపు ఈ పైపై మెరుగుల కోసం కాదురా అని అరవాలని మీకనిపిస్తోంది కదూ! అక్కడికే వస్తున్నాను. ఒకసారి హైకమాండ్ తో కలిసి మంత్రివర్గ సభ్యులూ, ముఖ్యమంత్రి, పీసీసీ, ఏఐసీసీ అధ్యక్షులూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో ప్రతి ఒక్కరికీ పెర్సంటేజీ పాయింట్లు ఫిక్స్ చేసుకోవాలి. ఆ పాయింట్లన్నీ కూడితే వంద అవుతుంది. మంత్రివర్గంలోని అన్ని శాఖల్నీ అనుసంధానం చేయడానికి ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది. దానిని లెక్కల్లో ఆరితేరిన సీనియర్ నాయకుడికి అప్పగించాలి. ఉదాహరణకి రోశయ్య లాంటి వాడన్నమాట.
  
ఈయన పనేమిటంటే ప్రతి రోజూ అన్ని శాఖల ఫైళ్ళూ చూసి ఏ ఫైలులో ఏ మంత్రి ఎంత తిన్నాడో లెక్కకట్టి ఆ తిన్న అమౌంటుని ఒక ఖాతాలో(ఇది టాక్స్ కి అందని అకౌంట్) జమచేసి, వారం వారం టోటల్ చేసి ప్రతి మంత్రికీ, పీసీసీ కి, ఏఐసీసీకి, వాళ్ళు ముందు ఫిక్స్ చేసుకొన్న పెర్సంటేజీ పాయింట్ల ఆధారంగా వాళ్ళకి అందచేస్తాడు.
 
ఈ పద్ధతిలో కీలకం ఏమిటంటే శాఖ ఏదైనా అమాత్యులవారికి వారికి ముట్టాల్సింది ముడుతుంది. ఎవడో దోచుకుపోతున్నాడు, నేను దోచుకోలేకపోతున్నాను అన్న ఏడుపుండదు కాబట్టి శాఖలకోసం ఏడ్చి చచ్చేవాళ్ళుందరు. ఎవరైనా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే అసమ్మతి, అసంతృప్తి ఉండవని నా ఉద్ధేశ్యం.
 
అలాగే మంత్రి పదవులు రాని వాళ్ళకోసం గనుల లీజులూ, సెజ్ కేటాయింపులలో వచ్చే అమ్యామ్యాలతో ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటుచేసి అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలని వాళ్ళ ప్రధాన్యత ధనబలం, కులబలం,జనబలం అధారంగా ఏబీసీ కేటగిరీలుగా విభజించి ఆ డబ్బుని పంచి పెట్టొచ్చు.

8 comments:

ANALYSIS//అనాలిసిస్ said...

ఫార్ములా బానే ఉంది గురూ ... కానీ ఎక్కువ ఆదాయం వచ్చే హోం, పరిశ్రమలు ర్, రెవెన్యూ లాంటివాళ్ళు దీనికి ఒప్పుకోరు. అలాగే ఆదాయం తక్కువ వచ్చే దేవాదాయ శాఖ, పశుసంవర్ధకశాఖలాంటి వాళ్ళౌ ఈ ఫార్ములాని ఒప్పుకుంటారు. ఎంతైనా కష్టపడి దోచుకున్నదానిలో పక్కోడికి వాటా ఇవ్వాలంటే కొచెం కస్టమే గురూ . ఆ సిట్యువేషన్‌లో నేనున్నా ,మీరున్నా అంతేనేమో ...

gajula said...

nenu seenu abhipraayamtho ekibhavistunnaanu .

Anonymous said...

ఆవిడ సమర్ధత గురించి పక్కన పెడితే .హోం మినిస్టర్ సబితా మీద ఇంత వరకు ఎలాంటి అవినీతి ఆరోపణ లేదనుకుంటా .పేపర్లలో చదివినంతవరకూ .........

Am I correct?

Apparao said...
This comment has been removed by the author.
Apparao said...

కృష్ణ గారు
భలే చమత్కారులు మీరు
శీను గారుతో నేను కూడా ఏకీభవిస్తున్నా

మీ పధకం ప్రకారం అయితే మన ప్రజా నాయకులు అవినీతి చేయడానికి బద్దకిస్తారేమో ? ఎవరు తిన్న మన వాటా మనకి వస్తుంది కదా

ఇలా అయితే మన దేశం అవినీతి లో వెనక పడిపోదూ

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఎక్కువ కలెక్ట్ చేసిన వాడికి ఎక్కువ వాటా అని పెట్టొచ్చు. అలాంటప్పుడు కథ మొదటికి వస్తుంది కదా అన్న అనుమానం వస్తుంది. ఎక్కువ వాటా అంతే. ఎక్కువగా వచ్చినదంతా వాడిదే కాదు.

Kannan said...

A very good blog is yours.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Thank you, Kannan sir.