జగన్ మోహన్ రెడ్డి man on a mission లాగా వడి వడిగా అడుగులేస్తున్నాడు. తన దగ్గర మూలుగుతున్న డబ్బుతో ఇతర పార్టీల నాయకులకి వల వేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచే ప్రయత్నం చేస్తాడని ఊహించారు కానీ అది మరీ ఇంత త్వరగా ఉంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఇప్పుడు కృష్ణా జిల్లా కాంగ్రెస్ నాయకులతో మొదలయిన కొనుగోలు లేదా ఆపరేషన్ ఆకర్ష, కోడ్ నేమ్ Jagan CM bY 2011, ఒక్క కాంగ్రెస్ పార్టీతో ఆగుతుందని ఎవరూ భవించడం లేదు.
కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి జగన్ వలకి విరుగుడుగా ఏదో ఒక నామినేటెడ్ పోస్టో, డబ్బు చేసుకోవడానికి వీలుగా కాంట్రాక్టులో, మన్నో మశానమో వెదజల్లి కనీసం తాత్కాలికంగా నయినా తన గూటి పక్షులు అటేపు వెళ్ళకుండా కాపాడుకున్నా ఇతర పార్టీలు, మరీ ముఖ్యంగా ప్రజారాజ్యం తన గూటి పక్షులను కాపలా కాయగలదా అన్నది ఇప్పుడు ఆ పార్టీ నాయకులను వేధిస్తున్న సమస్య.
చిరంజీవి పొడిచేస్తాడు, తమందరినీ అందలం ఎక్కించేస్తాడని అల్లు అరవింద్ కౌంటర్లో కోట్లు పోసి టిక్కెట్లు కొనుక్కొని ఎమ్మెల్యేలయిన వాళ్ళు, గెలవలేక బోర్లాపడి డబ్బు బొక్కయిన వాళ్ళకి తమ నష్టాన్ని పూడ్చుకోవడానికి జగన్ విసిరే గేలం ఒక అపురూపమయిన అవకాశం. అలాగే ఏడేళ్ళుగా అధికారానికి దూరమై సమీపంలో అధికారం దక్కే సూచనలు లేని తెలుగు తమ్ముళ్ళకి కూడా ఇది మంచి చాన్స్.
జగన్ పార్టీ ఎనికలలో గెలవడం మాట అటుంచి ఇప్పటికిప్పుడు జగన్ ఆఫర్ చేస్తున్న తాయిలం కళ్ళ ముందు నోరూరిస్తూ ఉంటే దాన్ని వదులుకోవడానికి ఎంత మంది సిద్ధంగా ఉంటారో చూడాలి.
జగన్ కౌంటర్లో ఎమ్మెల్యేల రేటు తాజాగా ఇరవై అయిదు కోట్లు అని ఒక సమాచారం. ఇక తతిమ్మా చిల్లర మల్లర నాయకులకి వాళ్ళ వెంట వచ్చే తాబేదారులని బట్టి రేటు నిర్ణయిస్తారట.
భలే మంచి చౌక బేరము, ఇది సమయమూ, మించినన్ మళ్ళీ మళ్ళీ రాదు బాస్ అనుకుంటూ ఎంత మంది జగన్ కొట్టు ముందు బారులు తీరుతారో అతి త్వరలో తెలిసి పోతుంది.
6 comments:
ముందు PRP వాళ్ళు వెళ్ళిపోతారు
పాపం చాలా రేటు పెట్టి కొనుక్కున్నారు
లాభం లేదు కృష్ణ గారు , మనం ఇద్దరం కలిసి రాజకీయ నాయకులకి ట్రైనింగు ఇవ్వాలి.
మీకు ఒక ప్రశ్న జగన్ కౌంటర్లో 25 కోట్లు అని మీకు ఎలా తెలుసు?
Very reliable source.He is very close to idupulapaya. Tried for assembly ticket last time. Key leader in Vempalle segment.Very loyal to the late YSR.
జగన్ దూకుడు చూస్తుంటే ముచ్చటేస్తుంది. మీ అనాలిసిస్ నా దృష్టిలో ఖచ్చితంగా నిజం కాదు.జగన్ కి చాలా భవిత ఉంది.అతను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి రాడు.
ఆరంభ శూరత్వం కాకుండా, ఇదే దూకుడు జగన్ 2014 వరకు కంటిన్యూ చేస్తే, సి ఎం పీటం నడుచుకుంటూ వస్తుంది.పారా హుషార్ అధికార,ప్రతిపక్ష నాయకులారా జగన్ చేతిలో 2014 ఎన్నికలలో చావు దెబ్బలు తినకుండా ఉండాలంటే చాలా కష్ట పడాలి.
ఎవరు సి ఎం అయినా మన రాష్ట్రానికి మంచి జరిగితే అంతే చాలు.
>> అతను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి రాడు.
అప్పి-బొప్పి, బలే పిచ్చోడిలా వున్నావే!
చూస్తా వుండు ఏం జరుగుతాందో..
ఒక్క సంవత్సరం చాలు జనాలు నిన్ను మర్చిపోటానికి
ఇక మూడున్నరేల్ల తర్వాత... రాజెవడు? రెడ్డెవడు?
అందుకే సోనియమ్మ జగన్ని తన్ని తరిమేసి, మూడున్నరేల్లూ కి.కు.రె. సీట్ జాగర్తగా చూసుకొమ్మని పంపింది.. కి.కు.రె. సీట్లో ఎన్ని ఎక్కువరోజులుంటే జగన్ ప్రభ అంత తక్కువవుతా వుంటది.
ఈ విషయం నీకు తెల్వక పోయినా, అంబటి రాంబాబు కి బాగా తెలుసు. అందుకే పావులు వేగంగా కదుల్తున్నాయి
I agree with అప్పి-బొప్పి . Your claims of reliable sources etc. are very fragile.
Politics is not that simple..
Post a Comment