నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, December 19, 2010

ఇన్నాళ్ళకు సోనియా నోటివెంట పీవీ మాట

ప్రస్తుతం జరుగుతున్న కాంగ్రెస్ ప్లీనరీలో పాతకాపుల్ని స్మరించుకొంటూ సోనియాగాంధీ మాజీ ప్రధాని పీవీ నరసింహా రావుని కూడా ఆ లిస్టులో ప్రస్తావించడం చూసి నాకు ఆశ్చర్యం, సంతోషం కలిగాయి. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అందరూ అనుకొంటున్న కాలంలో పగ్గాలు చేబట్టి సరయిన బలం(పార్లమెంటులో) లేకపోయినా ప్రభుత్వాన్ని నెట్టుకు రావడమే కాక ఆర్ధిక రంగంలో సంస్కరణలకి శ్రీకారం చుట్టి(అవి దేశానికి మంచి చేశాయా లేదా అన్నది చర్చకు పెట్టాల్సిన విషయం.అది వేరే సంగతి), దేశ ఆర్ధిక పరిస్థితి మెరుగు పరిచి, బంగారం కుదువ పెట్టుకొనే స్థితి నుంచి దేశాన్ని గెట్టెక్కించిన అపర చాణక్యుడిని కాంగ్రెస్ సోనియమ్మ నాయకత్వంలో ఉద్ధేశ్య పూర్వకంగా నిర్లక్ష్యం చేసింది.
 
వీటన్నిటికన్నా పీవీ చాణక్యం బాబ్రీ మసీదు సమస్యని పరిష్కరించడంలో ఉంది. ఎన్నో దశబ్ధాలుగా జాతికి తలనొప్పిగా తయారయిన బాబ్రీని కరసేవకులు చుట్టుముట్టినపుడు తల పక్కకి తిప్పుకోవడం ద్వారా సాల్వ్ చేసి పడేశాడు పీవీ. దరిమిలా సంభవించిన పరిణామాలు, వాటి వల్ల లాభనష్టాలు అనేది కూడా డిబేటబుల్. దాన్ని పక్కనుంచుదాం.
 
దేశానికి మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇంత చేసిన పీవీకి తగిన గుర్తింపు లభించలేదు. ఆయన మరణిస్తే ఆయన శవాన్ని హడావిడిగా రాష్ట్రానికి ప్యాక్ చేసి పంపారు. దేశ రాజధానిలో ఒక ఎకరమయినా ఆయన సమాధికి స్థలమే లేకపోయింది. 
 
ఇన్నాళ్ళూ దేశానికి తన అత్తగారి నాయనా, తన అత్తగారు, మొగుడూ మాత్రమే సేవ చేసి ఈ దేశాన్ని ఇంతదాకా లాక్కొచ్చారన్న భ్రమలో ఉన్నదేమో సోనియా ఇప్పటిదాకా. ఇన్నాళ్ళ తరువాతైనా ఆమె కళ్ళకి కమ్ముకున్న పొరలు తొలిగిపోయాయా? లేక ఎవడో స్పీచ్ రైటర్ పొరబాటుగా రాసిస్తే పీవీ పేరు ప్రస్తావించిందా? ఏదేమైనా ఇప్పటికైనా ఢిల్లీ దొరసాని మన పంతులు గొప్పతనాన్ని గుర్తించి ఆయనకు తగిన గుర్తింపునిచ్చి, పార్లమెంటు సెంట్రల్ హాలులో చిత్తరువు పెట్టడం, దేశ రాజధానిలో ఆయనకు స్మారక స్థూపం ఏర్పాటు చేయడం లాంటివి చేస్తే బావుంటుంది.

6 comments:

Anonymous said...

బాగా చెప్పారు !

సుజాత వేల్పూరి said...

అలాంటి భ్రమలు కాదులెండి, కాంగ్రెస్ ఇప్పుడు కష్టకాలంలో ఉంది కదా! పీవీ పేరు ఎత్తి కాస్త ప్రజాభిమానం సంపాదించాలనే తురుఫు ముక్కేమో ఇది. లేదా మీరన్నట్లు రైటర్ పొరపాటో !ఆయన శవాన్ని కాసేపు ఉంచడానికైనా ఆనాడు కాగ్రెస్ కార్యాలయం ఒప్పుకోలేదనే విషయాన్ని సోనియా మర్చిపోయినా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మర్చిపోయినా పీవీ అభిమానులెవరూ మర్చిపోలేదు.

Apparao said...

కృష్ణ గారు
అత్తగారికి కోడలికి పడుతుందా ?
ఆయన అత్తగారి మనిషాయే మరి
ఇక కాంగ్రెస్ కి నాయకులు లేరు అనుకున్న సమయం లో వచ్చారు పివి

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

బాగా చెప్పారు.
కానీ, చాలామంది చెప్పే బాధాకరమైన సాకేంటంటే ఆయన టైంలో చాలా స్కాంలు జరగడంవల్లా, ఆయనపేరును ప్రస్తావిస్తే ఆవిడగారు అలాంటివాటిని సమర్ధించినట్లవుతుందని ఆయన్ను పక్క్కుపెట్టారని. ఎంత విచిత్రమైన వాదన. పాపం పీవీజీ ఎంతటి ఖర్మయోగీ, సచ్చ్హీలుడూ అయివుండికూడా కొన్ని విషయాల్లో అప్పటి అవసరాల రీత్యా కొన్నిటిని చూసీ చూడనట్లు ఉపేక్షించడమో, మరికొన్ని ఆయనకు తెలియకుండానే (ఇప్పుడు మన్మోహంజీకి ఎదురైన 2G స్కాం లాగానే) కొన్ని మరకలంటినంతమాత్రాన అలా చెయ్యడం ఎంత అనాగరికం? పైగా సచ్చ్హీలత విషయంలో వీరి వంశ ఘన చరిత్ర ఏపాటిదో ఎవరికి తెలియదు.
కానీ, వాస్థవానికి పీవీజీ ప్రధానిగా ఉన్నన్నాళ్ళూ ఈవిడగారి మోదామోదాలతో సంబంధంలేకుండా దేశానికి ఏది మేలనిపిస్తే అది చేస్తూపోయి తన ప్రత్యేకతను చాటుకోవడం ఈవిడగారికి రుచించలేదట:) అదీ సంగతి.

Anonymous said...

ఆయన టైం లో అన్ని స్కాంలు జరిగితే ఆయన వెనకాల వేసుకొన్న సొమ్ము ఎంత? మరి అంత సంపాదించి ఉంటె ఆయన బంజారా హిల్స్ లోని ఇల్లు ఎందుకు అమ్ముకోవాలి? వాస్తవం గా చెప్పాలి అంటే ఈ దేశం లో పూర్తి కాలం పనిచేసిన ప్రధానమంత్రులలో పి.వి. నరసిం హారావు గారొక్కరే బెస్ట్. ఆయన ప్రతి సమస్య కి ఒక నిర్ణయం తీసుకొన్నారు. అది కాష్మిర్ లో ఎన్నికలు జరిపి పాక్ మాటలకు, అంతర్జాతీయ మీడీయా మాటలకు విలువ లేకుండా చేశారు. ఎన్నో సం|| గా ఉన్న ఖలిస్తాన్ (పంజాబ్) సమస్యను పూర్తిగా పరిష్కరించారు. పంజాబ్ లో శాంతి బద్రతలకు కారణమైనారు. ఇక ఆర్ధిక రంగం లో మార్పులకు ఆయన తీసుకున్న పాలసి షిఫ్ట్ మొదలైనవి అందరికి తెలిసిందే.

http://www.livemint.com/2009/12/15214229/Give-Narasimha-Rao-his-due.html#

SRI